Home

»

Latest News

హైదరాబాద్‌లో రానా "దమ్‌ మారో దమ్‌' టీమ్‌

Mar 25, 2011 9:18PM

rana wallpapers, rana stills, rana images, rana pics, rana photos, rana picturesలీడర్ తో తెలుగువారికి పరిచయమైన దగ్గుపాటి రానా తొలి బాలీవుడ్ చిత్రం 'దమ్ మారో దమ్'. ఈ చిత్రం ఏప్రిల్ 22న విడుదల కానుంది. రోహన్ సిప్పీ దర్శకత్వం లో రూపొందిన ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్, రానా, బిపాషా బసు కీలకపాత్రలు పోషించారు. అలాగే ఈ చిత్రలో హరే కృష్ణ'లోని పాపులర్ సాంగ్ 'దమ్ మారో దమ్' పాటని ఈ చిత్రంలో రీమిక్స్ చేశారు. ఆ పాటకి దీపికా పదుకోనే డాన్స్ చేసింది. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రానా, బిపాసా బసు తదితరులు పాల్గొన్నారు.

ముందుగా బిపాసా బసు మాట్లాడుతూ "రానా చాలా చక్కని ప్రతిభ కలిగిన నటుడు. అతనితో నటించటం చాలా ఆనందంగా ఉంది. నేను టక్కరి దొంగ అనే తెలుగు చిత్రంలో నటించాను. మంచి పాత్ర లభిస్తే మళ్ళీ తెలుగులో నటించటానికి నేను సిద్ధంగా ఉన్నాను. మా దమ్ మారో దమ్ మిమ్మల్నందర్నీ అలరిస్తుందని ఆశిస్తున్నాను" అని అన్నారు. ఈ చిత్ర దర్శకుడు ప్రసంగిస్తూ ఇది గోవా నేపథ్యంలో సాగే కథని అన్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com