Home

»

Latest News

"దూకుడు" లో అండర్‍ కవర్ కాప్ గా మహేష్ బాబు

Mar 25, 2011 9:22PM

mahesh babu wallpapers, mahesh babu stills, mahesh babu images, mahesh babu pics, mahesh babu photos, mahesh babu pictures "దూకుడు" చిత్రంలో అండర్ కవర్ కాప్ గా హీరో ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్నారని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, సమంత హీరోయిన్ గా, శ్రీను వైట్ల దర్శకత్వంలో, 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై, అనీల్ సుంకర, గోపీనాథ్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం"దూకుడు". ఈ చిత్రంలో మహేష్ బాబు అండర్ కవర్ కాప్ గా నటిస్తున్నారని సమాచారం. గతంలో కూడా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, మహేష్ బాబు హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం "పోకిరి"లో కూడా మహేష్ బాబు అండర్ కవర్ కాప్ గా నటించారు.

అలాగే ఈ "దూకుడు" చిత్రంలో కూడా అదే తరహాలో అండర్ కవర్ కాప్ గా హీరో మహేష్ బాబు నటిస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం ముంబాయిలో "దూకుడు" చిత్రంలో రాజు సుందరం నృత్య దర్శకత్వంలో, హీరో మహేష్ బాబు ఇంట్రడక్షన్ సాంగ్ ని షూట్ చేస్తున్నారు. ఈ పాట పూర్తయినా మహేష్ బాబు ముంబయ్ లోనే మరో మూడు రోజులుంటారని తెలిసింది. కారణం "దూకుడు" చిత్రానికి సంబంధించి ప్యాచ్ వర్క్ ని అక్కడే పూర్తిచేస్తారట.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com