.jpeg)
ఏప్రెల్ 3 న "100% లవ్" చిత్రం యొక్క ఆడియో రిలీజ్ చేయబడుతూందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే గీతా ఆర్ట్స్ పతాకంపై, యువ హీరో నాగచైతన్య హీరోగా, మిల్కీ వైట్ బేబీ తమన్నా హీరోయిన్ గా, సుకుమార్ దర్శకత్వంలో, బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రం "100% లవ్". ఈ చిత్రం ఆడియో అశేష అక్కినేని అభిమానుల సమక్షంలో, ఏప్రెల్ మూడవ తేదీన ఘనంగా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి యువ సంగీత తరంగం దేవీ శ్రీ ప్రసాద్ చక్కని సంగీతం అందించారని వినికిడి. ఈ చిత్రం పోస్టర్లు కూడా యువతకి వెర్రెత్తించేలా ఉన్నాయి. ముఖ్యంగా టీనేజ్ కుర్రకారుకి.
అలాగే ఈ చిత్రంలో హాట్ ఐటం గర్ల్ మేఘనా నాయుడు ఒక ఐటం సాంగ్ లో నటించిందని సమాచారం. ఈ చిత్రం ఏప్రెల్ 29 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రోజున రానా హీరోగా నటిస్తున్న "నేను- నా రాక్షసి" చిత్రం కూడా విడుదల కానుంది. గతంలో నాగచైతన్య "ఏ మాయ చేశావె", రానా "లీడర్" చిత్రాలు కూడా ఒక వారం గ్యాప్ లో విడుదలయ్యాయి. కానీ ఈసారి ఒకే రోజున ఈ ఇద్దరి సినిమాలూ విడుదల కావటం విశేషం.




.jpg)
.jpg)
