.jpg)
"అనుమానం" ముందు పుట్టి "ఆడది" తర్వాత పుట్టిందని కొంత మంది ఆడవాళ్ళ గురించి మగవాళ్ళు అప్పుడప్పుడూ చమత్కరిస్తుంటారు. కానీ.. "పైత్యం" "రాంగోపాల్ వర్మ" ఒకేసారి పుట్టాయి అంటే "కాదు" అని చెప్పేవారు ఉండరు. మన వర్మగారు చేసే పనులు అలా ఉంటాయి మరి. కేవలం తన సినిమాలోనే కాకుండా అప్పుడూ పాటలతోనూ ప్రేక్షకులను వర్మ. "రక్త చరిత్ర"లో "కత్తులతో సావాసం" అనే పాట పాడాడు వర్మ. అది ఫ్యాక్షన్ సినిమా కావడం, ఆ పాటకు గంభీరమైన గొంతు అవసరం కావడంతో వర్మ వాయిస్ సరిగ్గా సరిపోయింది. ఆ తర్వాత "సత్య 2" సినిమాలో ఒక రోమాంటిక్ ట్రాక్ పాడి అభాసుపాలయ్యాడు.
ఆ తర్వాత కొంతకాలం పాటలకు దూరంగా ఉన్న వర్మకు మళ్ళీ దురద మొదలైంది. అందుకే తాజాగా బెజవాడ ఫ్యాక్షనిజం నేపధ్యంలో వర్మ తెరకెక్కిస్తున్న ఆఖరి తెలుగు చిత్రం "వంగవీటి". ఈ సినిమాలోనూ రౌడీయిజం నేపధ్యంలో ఒక పాట ఉందట, ఈ పాటను తానే పాడతానంటున్నాడట వర్మ. వర్మ పాట సరదా బానే ఉంది కానీ.. ప్రేక్షకులు ఆయన పైత్యాన్ని మరోమారు భరించగలరా? అని అందరూ సందేహపడుతున్నారు!




.jpg)
.jpg)
