.jpg)
ఎనర్జీటిక్ స్టార్ రామ్ హీరోగా "కందిరీగ" ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాశీఖన్నా కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి "హైపర్" అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. సినిమాలో హీరో రామ్ క్యారెక్టర్ తోపాటు అతడి స్వభావానికి సరితగ్గట్టుగా ఉంటుందని ఈ టైటిల్ ను ఫిక్స్ చేశారు.
"నేను శైలజ" అనంతరం రామ్ నటిస్తున్న చిత్రమిదే. మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రామ్ కు చాలా కాలం తర్వాత "నేను శైలజ"తో వచ్చిన హిట్ ను "హైపర్" కంటిన్యూ చేస్తుందేమో చూడాలి!




.jpg)
.jpg)
