.jpg)
కొడితే కుంభస్తలం కొట్టాలని మన పెద్దాళ్ళు చెప్పిన మాటను బాలీవుడ్ కండల ఖాన్ సల్మాన్ ఖాన్ బాగా సీరియస్ గా తీసుకొన్నట్లున్నాడు. అందుకే తాజా చిత్రం "సుల్తాన్"తో మరో హీరో బద్దలుకొట్టడం అటుంచి కనీసం చేరుకోలేని సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాడు. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ నటించిన "సుల్తాన్" గత బుధవారం విడుదలై నేటికీ అయిదు రోజులు పూర్తి చేసుకొంది. మొదటిరోజే 41 కోట్ల రూపాయల ప్రారంభ వసూళ్లు సాధించి అమితంగా ఆశ్చర్యపరిచిన సల్మాన్.. మూడు రోజుల్లోనే వంద కోట్లు కొల్లగొట్టాడు. ఇక మూడో రోజు మొదలుకొని నేటితో "సుల్తాన్" రెండు వందల కోట్ల రూపాయల్ వసూళ్లకు అతి చేరువలో ఉంది.
అమీర్ ఖాన్ "పీకే", షారుక్ ఖాన్ "హ్యాపీ న్యూయార్" చిత్రాలు మొత్తం రన్ లో కలెక్ట్ చేసిన కలెక్షన్లను సల్మాన్ కేవలం అయిదు రోజుల్లో సాధించడంతో బాలీవుడ్ షాక్ అయిపోయింది. నిజానికి "సుల్తాన్" సినిమాకి సూపర్ హిట్ టాక్ ఏమీ రాలేదు. యావరేజ్ అన్నారు అంతే. అలాంటి యావరేజ్ టాక్ తెచ్చుకొన్న "సుల్తాన్" సినిమాకే అయిదురోజుల్లో 200 కోట్ల రూపాయలు కలెక్ట్ చేయగలిగాడంటే.. ఇక మొదటోరోజే సూపర్ హిట్ టాక్ వస్తే పరిస్థితి ఏంటీ అనేది ట్రేడ్ పండితుల చేతులకు, క్యాలిక్యూలేటర్లకు కూడా చిక్కడం లేదు!





.jpg)
