రామ్ చరణ్ కోసం శంకర్ సూపర్బ్ స్కెచ్!
on Aug 10, 2023

RRR వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘గేమ్ చేంజర్’. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ డైరెక్షన్‌లో దిల్ రాజు, శిరీష్ మూవీని నిర్మిస్తున్నారు. శంకర్ మేకింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతీ సన్నివేశాన్ని ఓ వండర్‌లా తెరకెక్కించాలని ఆయన తాపత్రయ పడుతుంటారు మరి. ‘గేమ్ చేంజర్’ మూవీ ప్రారంభమై రెండేళ్లు కావస్తుంది. ఇంకా పూర్తి కాలేదు. మరో వైపు ఫ్యాన్స్, ప్రేక్షకులు సినిమా అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. అదేంటంటే ‘గేమ్ చేంజర్’లో రామ్ చరణ్‌ను శంకర్ ఒకటి, రెండు కాదు.. ఏకంగా ఏడు లుక్స్‌లో చూపించబోతున్నారట.
రామ్ చరణ్ లుక్స్ విషయంలో శంకర్ అండ్ టీమ్ ఎంతో స్పెషల్ కేర్ తీసుకుంది. హాలీవుడ్ టెక్నీషియన్స్ లుక్స్‌ను కొత్తగా ప్లాన్ చేశారు. మెగా పవర్ స్టార్ ఇందులో తండ్రీ కొడుకులుగా కనిపించబోతున్నారు. తండ్రీ పాత్ర ముఖ్యమంత్రిగా కనిపించనుంటే, కొడుకు పాత్ర ఎన్నికలను నిర్వహించే ఐఏఎస్ ఆఫీసర్‌గా మెప్పించబోతున్నారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోన్న ‘గేమ్ చేంజర్’లో శ్రీకాంత్, ఎస్.జె.సూర్య, సునీల్ తదితరులు ఇతర పాత్రలను పోషించారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేయాలనేది శంకర్ ప్లానింగ్. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌పై ఫోకస్ చేస్తారు.
ఏకంగా మూడు వందల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టి ‘గేమ్ చేంజర్’ సినిమాను రూపొందిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా వచ్చే ఏడాది సమ్మర్‌లో మూవీ రిలీజ్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



