Home

»

Latest News

Ramayana Part 1: ఫస్ట్ డే రామాయణ రికార్డు కలెక్షన్స్! 

Nov 6, 2026 10:05AM

 

అయోధ్య రాముడు నిన్న సెల్యులాయిడ్ పై కాలు మోపిన విషయం తెలిసిందే. టాక్ కూడా పాజిటివ్ గా రావడంతో  ఆల్ ఓవర్ ఇండియాలోని సింగిల్ స్క్రీన్స్, మల్టి ప్లెక్స్ లు అభిమానులు, ప్రేక్షకులతో కళకళ లాడతున్నాయి. 

దీంతో మొదటి రోజు  వరల్డ్ వైడ్ గా 150 కోట్ల గ్రాస్ మార్కును చేరుకుని ట్రేడ్ వర్గాలని  సైతం ఆశ్చర్యపరిచింది. భాషల వారీగా చూస్తే, హందీ వెర్షన్ రికార్డు స్థాయిలో  47.50 కోట్ల షేర్‌తో సింహభాగం ఆక్రమించింది. కన్నడ వెర్షన్ 7.25 కోట్లు సాధించగా, తెలుగు ప్రాంతాలలో . 6 కోట్ల వసూళ్లను రాబట్టి దక్షిణాది మార్కెట్‌లో కూడా బలమైన పునాది వేసింది.

థియేటర్ల ఆక్యుపెన్సీ కూడా విశేషంగా నమోదైంది. ముఖ్యంగా ఈవెనింగ్ అండ్ నైట్ షోలలో హిందీ 3డి ఫార్మాట్‌లో అత్యధికంగా 38.08% ఆక్యుపెన్సీ నమోదవ్వగా, హైదరాబాద్‌లో 37.3%, కోల్‌కతాలో 38% పైగా థియేటర్ల సీట్లు నిండిపోయాయి.

 

ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ సినిమా సందడి మొదలైంది. నార్త్ అమెరికాలో మొదటి రోజు తొలి సగం సమయానికే $940,000 డాలర్లు వసూలు చేయగా, మొదటి రోజు మొత్తం ఓవర్సీస్ ప్రీమియర్లతో కలిపి సుమారు $3.5 మిలియన్ డాలర్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఘనంగా జరిగిన సాయి దుర్గాతేజ్ నిశ్చితార్థ వేడుక: అల్లు అర్జున్ స్పెషల్ ఎట్రాక్షన్!

సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్ మరియు రాబోయే దీపావళి లాంగ్ వీకెండ్ తోడుకావడంతో, ఫస్ట్ వీక్ లోనే  375 కోట్ల నికర కలెక్షన్ల మార్కును దాటుతుందని ట్రేడ్ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. లైఫ్‌టైమ్ బాక్సాఫీస్ రన్ పరంగా గ్లోబల్ మార్కెట్‌లో ఏకంగా1,600 కోట్ల నుంచి రూ. 1,800 కోట్ల కలెక్షన్లను కొల్లగొడుతుందని అంచనా వేస్తున్నారు.

రణ్‌బీర్ కపూర్ రాముడిగా చూపిస్తున్న అద్భుతమైన అభినయం, సీతగా సాయి పల్లవి ఒదిగిపోయిన తీరు,రావణాసురుడిగా యష్ చూపించిన రాజసం,ప్రొడక్షన్ వాల్యూస్, విజువల్ ఎఫెక్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చూస్తుంటే రిపీట్ ఆడియన్స్ పక్కా అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.  

మీకు నచ్చవచ్చు:ఘనంగా జరిగిన సాయి దుర్గాతేజ్ నిశ్చితార్థ వేడుక: అల్లు అర్జున్ స్పెషల్ ఎట్రాక్షన్!
మీకు నచ్చవచ్చు :సమ్మర్ హాలిడేస్ మూవీ రివ్యూ 

 

[Ramayana Part 1 First Day Collections, Ramayana first day box office collections, Ramayana Part 1 Day 1 collection, Ranbir Kapoor Ramayana box office, Tollywood, Tollywood News, Telugu Cinema, Telugu Cinema News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com