Home

»

Latest News

‘సీన్’ ట్విట్టర్ రివ్యూ: సూర్య హ్యాట్రిక్ కొట్టాడా.?

Nov 6, 2026 10:49AM

'కరుప్పు', 'విశ్వనాథ్ అండ్ సన్స్' వరుస విజయాలతో జోరు మీదున్న తమిళ స్టార్ సూర్య.. ఇప్పుడు ‘సీన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ‘ఆవేశం’, ‘రోమాంచమ్’ వంటి సినిమాలతో తనదైన మేకింగ్ స్టైల్ చూపించిన మలయాళ దర్శకుడు జిత్తు మాధవన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో సినిమాపై మొదటి నుంచీ ఆసక్తి నెలకొంది. ఇక సూర్య, నజ్రియా, నస్లేన్ కాంబినేషన్ కూడా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నవంబర్ 6న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ప్రస్తుతం సోషల్ మీడియాలో మంచి స్పందనే లభిస్తోంది.

‘సీన్’లో సూర్య ఇన్బరాజ్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు. గతంలో పరిష్కారం కాని ఓ కేసును ఛేదించేందుకు ఆయన మళ్లీ రంగంలోకి దిగుతారు. ఈ క్రమంలో విచిత్రమైన వ్యక్తిత్వాలు ఉన్న ఓ టీమ్‌తో కలిసి పనిచేయాల్సి వస్తుంది. నస్లేన్ పోషించిన ఈశ్వరన్ పాత్రతో సూర్యకు ఎదురయ్యే పోరాటం కథలో కీలకంగా నిలుస్తుంది.

సినిమా చూసిన పలువురు ప్రేక్షకులు ఫస్ట్ హాఫ్ చాలా బాగుందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సూర్య క్యారెక్టరైజేషన్, ఆయన ఇంట్రడక్షన్ సీక్వెన్స్, స్టైలిష్ నటన ఆకట్టుకున్నాయని అంటున్నారు. నస్లేన్ పాత్రను కూడా చాలా కొత్తగా డిజైన్ చేశారని, అతడి బాడీ లాంగ్వేజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని ప్రశంసిస్తున్నారు. నజ్రియా కామెడీ టైమింగ్, సూర్యతో ఆమె వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయించాయని చెబుతున్నారు.

సినిమాలోని ట్విస్టులు, సర్‌ప్రైజ్ కామియో ప్రేక్షకులకు మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తున్నాయని పోస్టులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోయిందని, అక్కడి నుంచి కథ మరింత ఆసక్తికరంగా మారుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. జిత్తు మాధవన్ తన మార్క్ కామెడీ, క్రైమ్ ఎలిమెంట్స్‌ను కొత్తగా కలిపారని, సుషిన్ శ్యామ్ సంగీతం కూడా సినిమాకు బాగా సెట్ అయిందని ప్రశంసిస్తున్నారు.

ఇది కూడా చదవండి: సమ్మర్ హాలిడేస్ మూవీ రివ్యూ

మరోవైపు కొంతమంది మాత్రం సినిమాపై మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కథలో బలం తక్కువగా ఉందని, ఇన్వెస్టిగేషన్ ట్రాక్ అంతగా ఆకట్టుకోలేదని కొందరు అంటున్నారు. నస్లేన్ పాత్రను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగాయని, కామెడీ కూడా అన్ని చోట్లా వర్కవుట్ కాలేదని మరికొందరు పోస్టులు పెడుతున్నారు.

మొత్తంగా చూస్తే ‘సీన్’కు సోషల్ మీడియాలో ఇప్పటివరకు ఎక్కువగా పాజిటివ్ స్పందనే కనిపిస్తోంది. సూర్య నటన, నస్లేన్ క్యారెక్టరైజేషన్, నజ్రియా కామెడీ, సర్‌ప్రైజ్ ఎలిమెంట్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా చెబుతున్నారు. అయితే కథనం, సెకండాఫ్ విషయంలో కొంతమంది ప్రేక్షకుల నుంచి విమర్శలు కూడా వస్తున్నాయి. మరి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్ని అందుకుంటోందో చూడాలి.

మీకు నచ్చవచ్చు:
రామాయణ మూవీ రివ్యూ
బిగ్ సర్‌ప్రైజ్‌.. అప్పుడే ఓటీటీలోకి ‘జైలర్ 2’.!

 

 

 

[Suriya Scene Twitter Review, Scene Review Telugu, Scene Movie Review, Scene Movie Public Talk, Suriya, Nazriya Nazim, Naslen, Jithu Madhavan, Scene Movie]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com