
రమేష్ జక్కల దర్శకత్వంలో ప్రసన్న లక్ష్మి భూమిరెడ్డి నిర్మాతగా ప్రసన్న భూమి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం "యద్భావం తద్భవతి".
వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఇనయ సుల్తానా, రేణు శ్రీ హీరోయిన్స్ గా నటిస్తుండగా సుమన్, నాగ మహేష్, లోహిత్ కుమార్, ధనరాజ్, శ్వేత వర్మ, దయానంద్ రెడ్డి, శ్రీకాంత్ అయ్యంగర్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమా నవంబర్ 27న థియేటర్లలో విడుదల విడుదల కానుంది. శ్యామ్ సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి మిహిరామ్ సంగీతం అందించారు. విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా "యద్భావం తద్భవతి" చిత్ర టీజర్ ను ప్రముఖ చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ గారి చేతుల మీదగా విడుదల చేయడం జరిగింది.
ఇది కూడా చదవండి: బాలయ్య ‘దాదా’ వాయిదా.. క్లారిటీ ఇచ్చిన మూవీ టీమ్.!
"యద్భావం తద్భవతి" టీజర్ ఆకట్టుకుంటోంది. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఇక వరుణ్ సందేశ్ పాత్రను డిజైన్ చేసిన తీరు కూడా బాగుంది. ఆ పాత్ర వెనుక ఏదో కథ దాగి ఉంది? అనే క్యూరియాసిటీ కలిగేలా మలిచారు.

టీజర్ లాంచ్ ఈ సందర్భంగా లగడపాటి శ్రీధర్ గారు మాట్లాడుతూ... "అందరికీ నమస్కారం. ఇప్పుడే యద్భావం తద్భవతి చిత్ర టీజర్ చూసాను. ప్రసన్న లక్ష్మి భూమిరెడ్డి గారు నిర్మించిన ఈ చిత్ర టీజర్ చూస్తుంటే చిన్న సినిమా అయినప్పటికీ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నట్లు అనిపిస్తుంది. అలాగే ఒక పాట కూడా చూడటం జరిగింది. రమేష్ జక్కల గారి దర్శకత్వం, మిహిరామ్ గారి సంగీతం చాలా బాగున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ కళ పట్ల ఉన్న అభిమానంతో సినిమా తీయడం చాలా పెద్ద విషయం.
ఈ సినిమాలో నటించిన వరుణ్ సందేశ్ అలాగే ఇతర నటీనటులకు చిత్ర బృందానికి నా అభినందనలు. లోహిత్, శ్రీకాంత్ అయ్యంగర్ వంటి ఎంతో సీనియర్ నటులు కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాను ప్రేక్షకులు అందరూ ఆదరించి నిర్మాత మరో సినిమా తీసేలా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను" అన్నారు.
మీకు నచ్చవచ్చు:
'ఇట్లు అర్జున' హీరో అనీష్ ఎవరు?.. నాగార్జున, ఎన్టీఆర్ సపోర్ట్ వెనుక అసలు కథ ఇదేనా.?
బాంబు పేల్చిన రెజీనా.. బాలీవుడ్లో సౌత్ హీరోయిన్లని ఇంత దారుణంగా చూస్తారా.?
[Yad Bhavam Tad Bhavathi Teaser, Yadbhavam Tadbhavathi Teaser, Varun Sandesh, Inaya Sultana, Ramesh Jakkala, Sridhar Lagadapati, Telugu Movies 2026, Telugu Film News]






