
ఈ మధ్య కాలంలో హీరోలకి ధీటుగా సోలో బొమ్మతో దూసుకుపోతుంది కీర్తి సురేశ్. స్టిల్ అయితే 'యేష నాగుల గట్టు మీద' సాంగ్ తో సత్తా చాటుతూ ఉంది. నిన్న కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కిన సరికొత్త బోల్డ్ అండ్ ఎమోషనల్ క్రైమ్ డ్రామా చిత్రం 'డోరతీ' తో థియేటర్స్ లో సందడి చేస్తుంది. సందడి చేస్తుండటమే కాదు సంచలనం సృష్టిస్తోంది.
ఇప్పుడు ఈ విభిన్నమైన చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సమాయత్తమయ్యారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున థియేటర్లలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఒక వైవిధ్యభరితమైన కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ సినిమా ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది.
'డోరతీ' చిత్రం అంతర్జాతీయ స్థాయిలోనూ అపూర్వమైన ప్రశంసలు అందుకోవడం విశేషం. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF 2026)లో సెప్టెంబర్ 11న ఈ సినిమా వరల్డ్ ప్రీమియర్ ప్రదర్శించబడింది. ప్రదర్శన ముగిసిన అనంతరం అంతర్జాతీయ ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి అద్భుతమైన స్టాండింగ్ ఓవేషన్ లభించింది. దాదాపు 10 సంవత్సరాల తర్వాత టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైన మొదటి తమిళ చిత్రంగా 'డోరతీ' చారిత్రాత్మక రికార్డు నెలకొల్పడం విశేషం. మ్యూజిక్ మైస్ట్రో ఇళయరాజా అందించిన నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచింది. 146 నిమిషాల నిడివితో కూడిన ఈ థ్రిల్లర్ ప్రతి సన్నివేశంలోనూ ప్రేక్షక దేవుళ్లను కట్టిపడేస్తుందనడంలో సందేహం లేదు.
.webp)
ఇది కూడా చదవండి: తెలంగాణ సినిమా విజయం: మట్టి సువాసన నుంచి ప్రపంచ వేదికల వరకు!
1990ల కాలం నాటి గ్రామీణ నేపథ్యంలో, పురుషాధిక్యత, పగ, కార్తీ మరియు సుబ్బు అనే ఇద్దరు బాల్య మిత్రుల మధ్య ఉండే గాఢమైన సంబంధం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. వినూత్నమైన కాన్సెప్ట్, బోల్డ్ కంటెంట్ మరియు ఎల్‌జీబీటీక్యూ అంశాలను కార్తీక్ సుబ్బరాజ్ అత్యంత ధైర్యంగా స్పృశించిన తీరు విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. కీర్తి సురేశ్‌తో పాటు సనత్ మరియు రిషికాంత్ ప్రధాన పాత్రల్లో తమ నటనా విశ్వరూపాన్ని ప్రదర్శించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకి విశేష స్పందన లభిస్తుండగా, కొన్ని వివాదాలు కూడా చుట్టుముట్టాయి. చిత్రంలోని బోల్డ్ కంటెంట్ కారణం చూపిస్తూ మలేషియా వంటి దేశాల్లో ఈ సినిమా ప్రదర్శనపై నిషేధం విధించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. అయితే, కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ టేకింగ్, తిరు ఛాయాగ్రహణం, ఇళయరాజా సంగీతం కలగలిపి ఈ చిత్రాన్ని ఒక అద్భుతమైన విజువల్ కావ్యంగా మార్చాయని సినీ విశ్లేషకులు కొనియాడుతున్నారు. అక్టోబర్ 2న థియేటర్లలోకి వస్తున్న ఈ బోల్డ్ అండ్ ఎమోషనల్ రైడ్ తెలుగు ప్రేక్షకులు ఏ మేర ఆదరిస్తారో చూడాలి.
[keerthy Suresh Dorothy Telugu Release Date, Keerthy Suresh Dorothy, Dorothy Telugu Release Date, Keerthy Suresh Bold Movie,Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]






