'కొండా'ను ఆపలేరు.. తెలంగాణ మంత్రికి ఆర్జీవీ వార్నింగ్!
on Oct 20, 2021

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల 'కొండా' అనే సినిమాను చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాజకీయ నేతలు కొండా మురళి- సురేఖ దంపతుల జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా.. తెలంగాణ రక్తచరిత్ర అవుతుందని ఆర్జీవీ అంటున్నారు. రీసెంట్ గా ఈ మూవీని గ్రాండ్ లాంచ్ చేశారు. అయితే ఈ మూవీ షూటింగ్ ని ఆపలేరంటూ తెలంగాణ మంత్రికి ఆర్జీవీ పరోక్షంగా వార్నింగ్ ఇవ్వడం సంచలనంగా మారింది.
ట్విట్టర్ వేదికగా తాజాగా ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు చేశారు. "అరచేతిని అడ్డుపెట్టి సూర్య కాంతిని ఆపలేరని ఆనాటి కార్ల్ మార్క్స్ తెలుసుకున్నట్టే, పిచ్చిపిచ్చి ప్రయత్నాలతో కొండా సినిమా షూటింగ్ ఆపలేరని నల్ల బల్లి సుధాకర్ తెలుసుకోవాలి...జై తెలంగాణ" అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు.
ప్రస్తుతం ఆర్జీవీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోవైపు 'నల్లబల్లి సుధాకర్' ఎవరు అనే చర్చలు కూడా మొదలయ్యాయి. తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఆర్జీవీ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది. దీంతో కొండా సినిమా షూటింగ్ ఆపేయాలంటూ ఎర్రబెల్లి నుంచి ఆర్జీవీకి బెదిరింపులు వచ్చాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



