వర్మకు మరో కొత్త భామ దొరికింది..!
on Mar 2, 2016
.jpg)
వర్మ చేతిలో పడితే, ఆ హీరోయిన్ కు ఎంతో కొంత అదృష్టం ఉన్నట్టే. గతంలో ఊర్మిళ అలాగే వర్మ చేతిలో బాగా షైన్ అయింది. ఆ తర్వాత నిషా కొఠారి కూడా కొన్ని సినిమాలు బాగానే పట్టింది. మొన్నీ మధ్యే సత్య 2 తో అనైకను తీసుకొచ్చిన వర్మ కన్ను లేటెస్ట్ గా నైనా గంగూలి అనే కొత్త ముఖంపై పడింది. తను తీస్తున్న సెన్సేషనల్ సినిమా వంగవీటిలో, వంగవీటి రంగా భార్య రత్నకుమారి పాత్రకు నైనా గంగూలీని తీసుకుంటున్నట్లు ప్రకటించాడు వర్మ.
రత్నకుమారిగారిని నేను చాలా దగ్గరి నుంచి చూసిన వాడిని. ఆవిడ జీవితంలో అనుభవించిన భావోద్వేగాలను పలికించే నటి కోసం సాగిన నా అన్వేషణ నైనా గంగూలీ దగ్గర ఆగింది. నైనా గంగూలీ అందమే కాక, నటన కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అంటూ పొగిడేశాడు వర్మ. నిన్నటి తరం నటి స్మితా పాటిల్ లాగే, నైనా కూడా చూసే వారి గుండెల్లో బాణాలు గుచ్చుతుందంటూ కితాబిస్తున్నాడు. మరి నైనా, ముందు ముందు వర్మగారి సినిమాల్లో ఇంకేం పాత్రలు చేస్తుందో చూడాలి..
MORE PHOTOS OF NAINA GANGULY HERE..
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



