వర్మతో వరసగా రెండు సినిమాలు చేసిన డిఓపీ..!
on Apr 1, 2016
.jpg)
వర్మ సినిమాలకు ప్రాణం సినిమాటోగ్రఫీ. వర్మ సినిమాకు పనిచేయాలంటే అదృష్టం ఉండాలి అనేది అందరూ అనుకునే మాట. కానీ ఆ అదృష్టాన్ని రెండు చేతులా అందుకున్నారు సినిమాటోగ్రాఫర్ అంజి. వర్మతో ఆయన పనిచేసిన రెండో సినిమా ఎటాక్ ఈ రోజు రిలీజైంది. సినిమా ఫలితం ఎలా ఉండబోతుందో అన్నది పక్కన పెడితే, అంజి కేమేరా పనితనం గురించి మాత్రం ఎటాక్ లో ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చాలా టాలెంట్ ఉంటే తప్ప వర్మ సినిమాలో అవకాశం దక్కదు. వర్మ తో పనిచేసే ప్రతీ ఒక్కరికీ చాలా విషయం ఉండాలి. లేదంటే ఆయన స్పీడ్ ను అందుకోవడం కష్టం.

వర్మ కార్పోరేషన్ లో అసిస్టెంట్ గా వర్క్ చేసిన అంజి ఐస్ క్రీమ్ తో డిఓపీగా మారారు. ఐస్ క్రీమ్ లాంటి ప్రయోగాత్మక సినిమాకు బాగా పబ్లిసిటీ వచ్చింది ఆ మూవీలోని ఫ్లోకామ్ టెక్నాలజీ గురించే. ఆ సినిమాను, ఫ్లోకామ్ ను రెండింటినీ సక్సెస్ ఫుల్ గా హ్యాండిల్ చేశారు అంజి. ఈరోజే రిలీజైన అటాక్ మూవీ సినిమాటోగ్రఫీకి కూడా మంచి పేరు రావడం విశేషం.
.jpg)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



