ద్రౌపదిపై ఆర్జీవీ కామెంట్స్
on Jun 23, 2022

రాంగోపాల్ వర్మ సంచలనాలకు పెట్టింది పేరు. ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసి వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఆయన ద్రౌపదీ ముర్ము గారిని టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. ద్రౌపదీ ముర్ము ప్రెసిడెంట్ ఐతే పాండవులు ఎవరు..? మరీ ముఖ్యంగా కౌరవులు ఎవరు ? అంటూ తన ట్విట్టర్ ఖాతాలో కాంట్రవర్సీ కామెంట్ ని పోస్ట్ చేశారు. ముర్ము ఈ పేరు ఇప్పుడు టాప్ ట్రేండింగ్ లిస్ట్ లో నిలబడింది.. రాంగోపాల్ వర్మ కూడా అగ్నికి ఆజ్యం పోస్తున్నట్టుగానే మాట్లాడుతూ ఉంటారు.
ఇప్పుడు ఈయన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు హీట్ పుట్టిస్తున్నాయి. ఇక ముర్ము గారు చాలా పేద కుటుంబంలో పుట్టిన మనిషి. తన పాతికేళ్ల కెరీర్ లో రాజకీయాల్లో చాలా ఉత్సాహంగా పాల్గొనేవారు. కౌన్సిలర్ నుంచి రాష్ట్రపతి పదవి వరకు పోటీ పడి ఎదిగారు. ఆదివాసీ మహిళ ఐనప్పటికీ ఆమె ఎదిగిన తీరు ఎంతో స్ఫూర్తిదాయకం అని చెప్పొచ్చు. రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపదీ ముర్ము జూన్ 25 న నామినేషన్ వేయనున్నారు. ఈ ఎలక్షన్స్ లో గెలిస్తే దేశంలోనే అత్యున్నత పదవికి ఎన్నికైన మొదటి ఆదివాసీ గిరిజన మహిళగా ఈమె చరిత్ర సృష్టించబోతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



