అమ్మానాన్నలకు శుభాకాంక్షలు : రామ్ చరణ్
on Feb 20, 2016
.jpg)
ఫిబ్రవరి 20, 1980 న కొణిదెల వారబ్బాయి శివ శంకర వరప్రసాద్ కు, అల్లు వారమ్మాయి సురేఖకు పెళ్లయింది. తర్వాత శివ శంకర వర ప్రసాదే చిరంజీవిగా, మెగాస్టార్ గా మారి తెలుగు సినిమాల్ని కుమ్మేశాడు. పెళ్లయిన తర్వాతే చిరంజీవికి విశేషంగా కలిసొచ్చింది. అద్భుతమైన సినిమాలు పడ్డాయి. తన టాలెంట్ తో, కొత్త డ్యాన్సులు, ఫైట్లతో యూత్ కు రోల్ మోడల్ గా మారిపోయాడు. 80 ల్లో యువతకు ఆరాధ్య దైవంగా మారి, మూడు దశాబ్దాల పాటు తిరుగులేని మెగాస్టార్ గా ఎదిగాడు. ఆయన అదృష్టానికి తన సతీమణి సురేఖే కారణమని నమ్ముతారు చిరంజీవి. అందుకే ఆయనకు పెళ్లిరోజు చాలా ప్రత్యేకం. ఈ సందర్భంగా, చిరు తనయుడు రాంచరణ్, తల్లిదండ్రులకు పెళ్లిరోజు శుభాకాంక్షలను తెలుపుతూ చిరు,సురేఖలు కలిసున్న ఫోటోను తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. ఎక్కడో ఫారిన్ లో దిగినట్టున్న ఈ ఫోటోలో, చిరంజీవి టీషర్ట్ తో చాలా యంగ్ గా కనిపించడం విశేషం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



