
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ #RC17 గురించి ఒక బిగ్ అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమా కోసం రామ్ చరణ్ ఏకంగా 15 కేజీల బరువు తగ్గి, లాంగ్ హెయిర్ వింటేజ్ లుక్‌లో కనిపించబోతున్నారని సమాచారం.
'రంగస్థలం'లో చిట్టిబాబుగా రామ్ చరణ్‌ని సుకుమార్ ప్రెజెంట్ చేసిన తీరు చూసి ప్రతీ ఒక్కరూ ఫిదా అయిపోయారు. ఆరేళ్ల తర్వాత మళ్లీ ఈ మ్యాజికల్ కాంబో రిపీట్ అవుతుండటంతో 'RC17'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసారి సుకుమార్ మరింత పవర్ ఫుల్ స్క్రిప్ట్ తో రాబోతున్నారు. ముఖ్యంగా చరణ్ లుక్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఒక కంప్లీట్ ట్రాన్స్‌ఫార్మేషన్‌ని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ సినిమా కోసం చరణ్ చాలా లీన్‌గా, అంటే మరింత సన్నగా మారబోతున్నారు. దీనికోసం ప్రత్యేకంగా డైట్, వర్కవుట్ ప్లాన్ చేసి సుమారు 15 కేజీల బరువు తగ్గనున్నారట. అంతేకాదు, ఈ లీన్ బాడీకి తోడు గుబురు గడ్డం, లాంగ్ హెయిర్ తో.. స్టైలిష్ లుక్‌లో కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ లుక్‌లో చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుందని టీమ్ వర్గాలు చెబుతున్నాయి.
దర్శకుడు సుకుమార్ ఇప్పటికే RC17 ఫస్ట్ హాఫ్ స్క్రిప్ట్‌ను లాక్ చేసేశారు. ప్రస్తుతం టీమ్ అంతా సెకండ్ హాఫ్ ని లాక్ చేసే పనుల్లో బిజీగా ఉంది. ప్రతి సీన్, ప్రతీ డైలాగ్ ఎంతో పవర్‌ఫుల్‌గా వచ్చేలా సుకుమార్ తన మార్క్ డిటైలింగ్‌తో వర్క్ చేస్తున్నారు.
మొన్నటి వరకు బల్క్ బాడీల ట్రెండ్ నడిచింది. కానీ, ఇప్పుడు స్టార్స్ లీన్ బాడీ వైపు మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ తన అప్ కమింగ్ మూవీ 'డ్రాగన్' కోసం బరువు తగ్గి, సన్నగా మారిపోగా.. ఇప్పుడు చరణ్ కూడా RC17 కోసం బరువు తగ్గుతున్నాడనే వార్త ఆసక్తికరంగా మారింది.
RC17, Ram Charan, Sukumar, NTR, Dragon






