
రచయితగా, దర్శకుడిగా పూరి జగన్నాద్ కి ఉన్న క్యాపబిలిటీ తెలిసిందే. ఎలాంటి జోనర్ సబ్జెక్ట్ అయినా తన మార్క్ ని మాత్రం ప్రేక్షకుడు కనిపెడతాడు. ప్రస్తుతం విజయ్ సేతుపతితో స్లమ్ డాగ్ తెరకెక్కిస్తున్నాడు. పూరీ వ్యక్థగత విషయానికి వస్తే పూరి కుమార్తె పేరు పవిత్ర. సోషల్ మీడియాలో చాలా క్రియాశీలకంగా ఉంటూ, తన జీవన శైలికి సంబంధించిన విభిన్న అంశాలని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందిస్తు 'రాత్రి నాకు కేదారనాథ్ ఆలయానికి సంబంధించిన ఒక అద్భుతమైన కల వచ్చింది. సాధారణంగా మనకు ఎన్నో కలలు వస్తుంటాయి కానీ, ఈ కల మాత్రం చాలా ప్రత్యేకం. సాక్షాత్తూ ఆ కేదారేశ్వరుడే నన్ను రమ్మని పిలుస్తున్నట్లుగా, ఒక ఆధ్యాత్మిక పిలుపులా ఆ స్వప్నం అనుభూతినిచ్చింది. ఆ కలలోని అనుభూతి ఎంత గాఢంగా ఉందంటే, ఆ మరుసటి రోజే కేదారనాథ్ ఆలయ చిత్రాన్ని గీయడం స్టార్ట్ చేశాను. సాధారణ చిత్రలేఖన శైలిలో కాకుండా, ఎంతో ఏకాగ్రత, సహనం అవసరమయ్యే సంక్లిష్టమైన 'మండల ఆర్ట్' (Mandala Art) శైలిలో ఈ ఆధ్యాత్మిక చిత్రాన్ని మొదలు పెట్టాను. ఈ కేదారనాథ్ మండల ఆర్ట్ చిత్రాన్ని పూర్తి చేయడానికి ఏడూ రోజుల సమయం పట్టింది. ఈ 7 రోజుల ప్రయాణంలో ప్రతి గీతలో ఒక పవిత్రమైన ప్రార్థన, ప్రతి ఆకృతిలో ఒక అమూల్యమైన భావాన్ని, అలాగే ప్రతి రంగులోనూ తనలోని 100 శాతం నిశ్చలమైన భక్తిని నింపుతూ రూపొందించాను. కేవలంవారంలో పూర్తయినప్పటికీ, ఆ చిత్రాన్ని గీస్తున్నంత సేపు ఎన్నో సంవత్సరాలుగా పని చేస్తున్నంత అనుభూతి కలిగింది. ఆర్ట్ వర్క్ పూర్తయిన మరుక్షణమే నా మనసులో వర్ణించలేని ఒక అపూర్వ ప్రశాంతత, ఆధ్యాత్మిక ఆనందం నెలకొన్నాయి. నేను ప్రత్యేకంగా ఎక్కడా చిత్రలేఖనం నేర్చుకోలేదు. సహజంగా పుట్టుకొచ్చిన ఈ కళ క్రమక్రమంగా నా ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక అంతర్భాగంగా మారింది. పవిత్ర జీవితంలో పరమశివుడు కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు. నా మనసులోని ఆనందాన్ని, బాధని , ప్రశాంతతని పంచుకునే ఏకైక బలం, ఓదార్పు ,ఆ మహాదేవుడే. జీవితంలో ఏ సందర్భం ఎదురైనా మనస్ఫూర్తిగా సంభాషించేది ఆ పరమేశ్వరుడితోనే అని కూడా చెప్పుకొచ్చింది. దీన్ని బట్టి ఆమె ఎంత శివ భక్తురాలో అర్ధం చేసుకోవచ్చు.
Puri Jagannath, Pavitra, Kedarnath







