
తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, నాటకరంగ దిగ్గజం, రచయిత ఎల్లాప్రగడ సౌభాగ్య కృష్ణేశ్వరరావు (YS కృష్ణేశ్వరరావు) కన్నుమూశారు. గత కొంతకాలంగా శ్వాసకోశ, గుండె సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, నేడు(ఆగస్టు 11) గుంటూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
చిన్నతనం నుంచే నాటకరంగంపై మక్కువ పెంచుకున్న కృష్ణేశ్వరరావు.. తన సుదీర్ఘ ప్రస్థానంలో ఏకంగా 1,500కు పైగా నాటకాల్లో నటించారు. 'ప్రచండ భారతం' సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన ఆయన.. తనదైన నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోశారు. కేవలం నటుడిగానే కాకుండా, రచయితగానూ తనదైన ముద్ర వేశారు.
YS Krishneswara Rao, Passed Away, Telugu Cinema, Tollywood






