Home

»

Latest News

రామ్ చ‌రణ్ క‌ష్టం.. యూ ట్యూబ్ పాలు

Dec 12, 2016 11:27AM

 

పైర‌సీ తెలుగు చిత్ర‌సీమ‌ని సంక్షోభంలో నెట్టేస్తోంది.  యేడాది పాటు క‌ష్ట‌ప‌డి ఓ సినిమా చేస్తే.. విడుద‌లైన రోజే ఆ సినిమా పైర‌సీ అయిపోతోంది. ఆ బారీన రామ్ చ‌ర‌ణ్ ధృవ కూడా ప‌డిపోయింది. రామ్ చ‌ర‌ణ్ - సురేంద‌ర్ రెడ్డి కాంబోలో వ‌చ్చిన ధృవ పాజిటీవ్ టాక్ తెచ్చుకొంది. పెద్ద నోట్ల దెబ్బ‌తో ధృవ వ‌సూళ్లు బాగా మంద‌గించాయి.  ఈ సినిమా  మెల్లిమెల్లిగా కోలుకొంటోంద‌న్న త‌రుణంలో ఇప్పుడు పైర‌సీ చీడ ప‌ట్టుకొంది. ధృవ సినిమా మొత్తాన్ని ఆదివారం అర్థ‌రాత్రి యూ ట్యూబ్‌లో పెట్టేశారు కొంత‌మంది. దాంతో మెగా ఫ్యాన్స్, చిత్ర‌బృందం షాక్‌కి గురైంది. వెంట‌నే రంగంలోకి దిగి.. ఆ లింకుల్ని తీసేసే ప్ర‌య‌త్నం చేసింది చిత్ర‌బృందం. కాస్త తొంద‌ర‌గా కోలుకోవ‌డంతో... ధృవ పైర‌సీనీ అరిక‌ట్ట‌గ‌లిగింది చిత్ర‌బృందం.  ఈ సినిమాని ఆన్ లైన్ లో వ‌దిలిన వాళ్ల కోసం చిత్ర‌బృందం గాలిస్తోంది. అంతేకాదు.. యాంటీ పైర‌సీ సెల్‌కి పిర్యాదు చేయ‌డానికి  రెడీ అవుతోంది. రామ్ చ‌ర‌ణ్ ఈ సినిమా కోసం చాలా కష్ట‌ప‌డ్డాడు. కెరీర్‌లో తొలిసారి సిక్స్ ప్యాక్ చేశాడు. ఇప్పుడిప్పుడే చ‌ర‌ణ్ క‌ష్టానికి త‌గిన గుర్తింపు ల‌భిస్తోంది. ఇంత క‌ష్ట‌ప‌డి చేసిన ఈ సినిమా ఇలా పైర‌సీ బారీన ప‌డ‌డం... బాడ్ ల‌క్‌!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com