Home

»

Latest News

మహానటిగా సమంత

Dec 11, 2016 4:02PM

మహానటి సావిత్రి..వెండితెరపై చెరగని సంతకం. తెలుగుజాతి మరువలేని నటి సావిత్రి. ఆమె నటనా కౌశలం ఒక గ్రంథాలయం..అందుకే తరాలు మారినా తెలుగు చలనచిత్ర చరిత్రలో మహానటి అంటే ఎప్పటికీ గుర్తొచ్చేది సావిత్రి ఒక్కరే. అలాంటి సావిత్రి జీవితం ఆధారంగా మహానటి పేరుతో తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం రూపొందేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఎవడే సుబ్రమణ్యం చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. నటనకే భాష్యం చెప్పిన మహానటి పాత్రలో నటించే హీరోయిన్ కోసం అశ్విన్ సుధీర్ఘ కసరత్తు చేశారు. నయనతార, అనుష్క ఇలా చాలా మంది పేర్లు వినిపించాయి. కానీ ఆ అదృష్టం సమంతకి దక్కినట్లు తెలుస్తోంది. జనతా గ్యారేజ్ తర్వాత ఏ సినిమాలు చేయకపోవడం..నాగచైతన్యతో పెళ్లి కుదరడంతో తనకు తగ్గ పాత్రల కోసం ఎదురుచూస్తోంది. ఆ సమయంలో నాగ్ అశ్విన్ కథ బాగా నచ్చడంతో సావిత్రి పాత్రకు ఓకే చెప్పింది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com