Home

»

Latest News

బాబికి వార్నింగ్ ఇచ్చిన ఎన్టీఆర్

Dec 12, 2016 11:39AM

 

ఎన్టీఆర్ - బాబి కాంబినేష‌న్‌లో ఓ చిత్రం సెట్స్‌పైకి వెళ్ల‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. అయితే.. ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం చేయ‌నున్నాడ‌ని, ఎన్టీఆర్ ప‌క్క‌న ముగ్గురు హీరోయిన్లు న‌టిస్తార‌న్న వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. నిజానికి ఈ సినిమాకి సంబంధించిన స‌ర్‌ప్రైజింగ్ ఎలిమెంట్‌.. మూడు పాత్ర‌ల్లో ఎన్టీఆర్ క‌నిపించ‌డం. ఈ క‌థ‌కు అదే అతి పెద్ద ట్విస్ట్ అని స‌మాచారం. అయితే... ఆ మేట‌ర్ ఈ సినిమా ప‌ట్టాలెక్క‌కముందే బ‌య‌ట‌కు వ‌చ్చేయ‌డం వ‌ల్ల ఎన్టీఆర్ సీరియ‌స్ అయ్యాడ‌ని స‌మాచారం. క‌థ‌కి చాలా కీల‌క‌మైన విష‌యం ముందే మీడియాకు ఎలా తెలిసింది?  అని ఎన్టీఆర్ ఆరా తీశాడ‌ని స‌మాచారం. ఈ విష‌యంపై  ద‌ర్శ‌కుడు బాబిపై ఎన్టీఆర్ సీరియ‌స్ అయ్యాడ‌న్న టాక్ వినిపిస్తోంది. ఎట్టిప‌రిస్థితుల్లోనూ సినిమాకి సంబంధించిన ఏ విష‌యం లీక్ అవ్వ‌కూడ‌ద‌ని, అందుకు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని బాబికి సూచించాడ‌ట‌. సినిమా మొద‌ల్వ‌క ముందే.. బాబికీ ఎన్టీఆర్‌కీ మ‌ధ్య డిష్యూం డిష్యూం మొద‌ల‌వ్వ‌డం ప‌ట్ల చిత్ర‌బృందం  టెన్ష‌న్ ప‌డుతోంది. సినిమా కొబ్బ‌రికాయ్ కొట్ట‌క‌ముందే... ఇలా నెగిటీవ్ టాక్ స్ప్రెడ్ అవ్వ‌డం అంత శుభ‌సూచికం కాక‌పోయినా త్వ‌ర‌లోనే ప‌రిస్థితి పూర్తి కంట్రోల్‌లోకి వ‌స్తుంద‌ని క‌ల్యాణ్ రామ్ భావిస్తున్నాడ‌ట‌. ఇక‌నైనా బాబి కాస్త జాగ్ర‌త్త‌గా ఉంటే మంచిది. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com