Home

»

Latest News

'ధృవ' రిలీజ్ డేట్ ఫిక్స్..!

Oct 16, 2016 2:17PM


ప్రస్తుతం ధృవ సినిమాతో చాలా బిజీగా ఉన్నాడు రాం చరణ్. బ్రూస్లీ తరువాత చాలా గ్యాప్ తీసుకొన్న చరణ్ ఈసినిమాపైనా చాలానే ఆశలు పెట్టుకున్నాడు. తమిళ సూపర్ హిట్ సినిమా తనీ ఒరువన్కు రీమేక్గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ముందు ఈసనిమాను దసరాకు రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ చరణ్, చిరంజీవి 150వ సినిమా నిర్మాణ పనుల్లో బిజీగా ఉండటం, మధ్యలో విలన్గానటిస్తున్న అరవింద్ స్వామి ఆరోగ్యం బాలేకపోవటంతో ఆలస్యమైంది. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. అన్నికార్యక్రమాలు పూర్తి చేసి డిసెంబర్ 2న ధృవ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ భావిస్తుందట. కాగా  చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com