Home

»

Latest News

మీలో ఎవరు కోటీశ్వరుడు.. చిరంజీవి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Oct 16, 2016 3:34PM


మెగా అభిమానులకు బంపరాఫర్ లా చిరంజీవి 150 వ సినిమా ద్వారా సిల్వర్ స్క్రీన్ రీ ఎంట్రీ ఇవ్వడమే కాకుండా త్వరలో బుల్లి తెర ఎంట్రీ కూడా ఇస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో ఘనవిజయం సాధించిన మీలో ఎవరు కోటీశ్వరుడు షోకు నాగార్జున స్థానంలో ఇప్పుడు చిరంజీవి ఎంట్రీ ఇస్తున్నారు. దీంతో ఈ షోకు భారీగా క్రేజ్ పెరిగింది. మరి ఈ షోకు చిరంజీవి తీసుకుంటున్న రెమున్యరేషన్ వింటే షాకవ్వాల్సిందే. ఇప్పుడు ఈయన తీసుకునే పారితోషికంపైనే మీడియా సర్కిల్స్ లో భారీ ప్రచారం జరుగుతోంది. ఈ షో కోసం గంటన్నర పాటు ప్రసారమయ్యే ఒక్కో ఎపిసోడ్ కు పది లక్షల రూపాయిలను రెమ్యూనరేషన్ గా అందుకోనున్నాడట. మరి ఎంతైనా మెగా స్టార్ కదా పది లక్షలు ఏంటి.. అంతకన్నా ఎక్కువ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాగా  డిసెంబర్ 2నుంచి ఈ షో ప్రేక్షకుల ముందుకు రానుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com