సంపత్ దర్శకత్వంలో, రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న "రచ్చ" చిత్రంలో తమన్నా హీరోయిన్ గా ఎన్నికయ్యిందని తెలిసింది. ఈ "రచ్చ" చిత్రాన్ని మెగా సూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై, యన్.వి.ప్రసాద్, పరాస్ జైన్ నిర్మిస్తున్నారు. సంపత్ నంది చెప్పిన కథ హీరో రామ్ చరణ్ కి బాగా నచ్చటంతో ఈ సినిమా ప్రారంభం కానుంది. ఈ "రచ్చ" చిత్రంలో మిల్కీ వైట్ భామ తమన్నా హీరోయిన్ గా నటించేందుకు అంగీకరించిందని సమాచారం. సంపత్ నంది గతంలో "ఏమైంది ఈ వేళ" అన్న సినిమాకి దర్శకత్వం వహించారు. సంపత్ నంది చెప్పిన కథ విన్న తర్వాత ఈ చిత్రాన్ని చూసి హీరో రామ్ చరణ్ ఈ మూవీ చేయటానికి వెంటనే అంగీకరించారట.
ఈ"రచ్చ" ఒక పక్కా మాస్ మసాలా మూవీ అనీ, ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్రలో నవరసాలూ కలిసున్నాయనీ ఫిలిం నగర్ వర్గాల ద్వారా అందిన సమాచారం. ప్రస్తుతం దర్శకుడు సంపత్ నంది పర్యవేక్షణలో హీరో రామ్ చరణ్ కి ఒక ఫొటో షూట్ ని చేస్తున్నారు. అలాగే హీరోయిన్ తమన్నా "బద్రీనాథ్" చిత్రంతో పాటు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, యన్ టి ఆర్ హీరోగా నటిస్తున్న చిత్రంలో కూడా తమన్నా హీరోయిన్ గా నటిస్తూంది. సంపత్ నంది దర్శకత్వంలో, రామ్ చరణ్ హీరోగా, తమన్నా హీరోయిన్ గా నటించబోయే "రచ్చ" చిత్రం ఏప్రెల్ నుండి షుటింగ్ ప్రారంభించుకుంటుంది.
Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సంపత్, రామ్ చరణ్ "రచ్చ"లో తమన్నా
Mar 8, 2011 10:44AM
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com






