Home

»

Latest News

రాజమౌళి "ఈగ" కి మళ్ళీ సెంథిల్

Mar 8, 2011 11:28AM

senthil kumar stills, senthil kumar photos, senthil kumar images, senthil kumar pics, senthil kumar wall papersరాజమౌళి దర్శకత్వంలోని "ఈగ" చిత్రానికి మళ్ళీ సెంథిల్ కుమార్ కెమెరామేన్ గా వచ్చారు. ఈ "ఈగ" చిత్రానికి ముందుగా జేమ్స్ పౌల్ ని కెమెరామేన్ గా ఎన్నుకున్నారు.కానీ రాజమౌళి వర్కింగ్ స్టైల్ కి అతనికీ కుదరక పోవటంతో సెంథిల్ కుమార్ నే రాజమౌళి రమ్మని కబురు పంపారట. రాజమౌళి, సెంథిల్ కుమార్ కాంబినేషన్ లో గతంలో ఛత్రపతి, యమదొంగ, మగధీర వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలు వచ్చాయి. అదీ గాక ఆ మధ్య కోడి రామకృష్ణ దర్శకత్వంలో అనుష్క నటించగా వచ్చిన "అరుంధతి" చిత్రానికి కూడా సెంథిల్ కుమార్ డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ నిర్వహించారు.

రాజమౌళి "ఈగ" చిత్రంలో గ్రాఫిక్స్ అధికంగా ఉండటం, సెంథిల్ గతంలో రాజమౌళితో పనిచేసి ఉండటం వల్లా, రాజమౌళికి ఏం కావాలో సెంథిల్ తేలికగా గ్రహించగలడని, ఆ విధమగా రిజల్ట్ అందించగలడని "ఈగ" చిత్రానికి రాజమౌళి మళ్ళీ సెంథిల్ నే తీసుకోవటం జరిగిందట. మరి రాజమౌళి, సెంథిల్ కాంబినేషన్ లో రాబోతున్న "ఈగ" చిత్రం విజువల్ ఫీస్ట్ అవుతుందనటంలో సందేహం అక్కర్లేదు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com