ఇక చరణ్ ఒక్కడే కొట్టాలి
on Sep 20, 2016

ఇది వరకు రూ.50 కోట్ల క్లబ్ అంటే... ఆహా - ఓహో అనిపించేది. ఇప్పుడు యాభై కోట్లు ఈజీ టార్గెట్టే. సినిమా బాగుండి.. కాస్త పాజిటీవ్ టాక్ వస్తే.. రూ.50 కోట్లు కొట్టడం ఈజీనే. అందుకే ఇప్పుడు అందరి దృష్టీ వంద కోట్లపై పడింది. పవన్ కల్యాణ్, మహేష్‌బాబు, ఎన్టీఆర్, బన్నీ వీళ్లంతా రూ.50 కోట్లు దాటి ఎప్పుడో వంద కోట్ల క్లబ్లో చేరిపోయారు. ప్రభాస్ అయితే వీళ్లందరినీ దాటేసి రూ.500 కోట్ల మైలు రాయి అందుకొని ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఇక వంద కోట్టి సత్తా చూపించాల్సింది రామ్ చరణ్ మాత్రమే. మగధీర అప్పట్లో వందకు దగ్గరగా వెళ్లింది. ఆ తరవాత చరణ్ సినిమాలు కొన్ని 40 నుంచి 50 కోట్లు వసూలు చేశాయి. ఇవి మంచి ఫిగర్లేగానీ... వందతో పోలిస్తే తక్కువ. అందుకే చరణ్ టార్గెట్ ఇప్పుడు వంద కోట్లపై పడింది. ధృవతో వంద కొట్టాల్సిందే అని కంకణం కట్టుకొన్నాడట చరణ్. వంద కోట్టాలంటే సోలో రిలీజ్ అవవసరం. అందుకే దసరాకి రావల్సిన సినిమా డిసెంబరుకి తీసుకెళ్లాడని తెలుస్తోంది. చరణ్ కూడా సెంచరీ కొట్టేస్తే దాదాపుగా టాప్ హీరోలంతా ఈ మైలు రాయిని అందుకొన్నవాళ్లు అవుతారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



