Home

»

Latest News

గాయనిగా కలర్స్ స్వాతి

Apr 12, 2011 10:10AM

colours swathi hot wallpapers, colours swathi hot stills, colours swathi hot images, colours swathi hot pics, colours swathi hot photos, colours swathi hot picturesగాయనిగా కలర్స్ స్వాతి కొత్త అవతారమెత్తింది. వివరాల్లోకి వెళితే ఒక టివి ఛానల్లో కలర్స్ అనే కార్యక్రమం ద్వారా పాప్యులర్ అయిన కలర్స్ స్వాతి ఆ తర్వాత నటిగా మారింది. "ఆడవారి మాటలకు అర్థాలు వేరులే" చిత్రంలో హీరోయిన్ త్రిషకు చెల్లిగా నటించింది. ఆ తర్వాత "అష్టా చమ్మా" చిత్రంతో మెయిన్ హీరోయిన్ గా నటించి విజయం సాధించింది. ఆ తర్వాత "కలవరమాయే మదిలో", "గోల్కొండ హైస్కూల్" వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

 

అటువంటి కలర్స్ స్వాతి ఇప్పుడు గాయనిగా కూడా మారింది. వివరాల్లోకి వెళితే యువ హీరో నాగచైతన్య హీరోగా, మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా, సుకుమార్ దర్శకత్వంలో, గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్న "100% లవ్" చిత్రం కోసం దేవీ శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో కలర్స్ స్వాతి ఒక పాట పాడింది. ఆ పాటకు "100% లవ్" చిత్రం ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో దేవీ శ్రీ ప్రసాద్ తో కలసి ఆడింది...పాడింది.

 

భవిష్యత్తులో పాదే అవకాశాలొస్తే తాను పాడతానంటోంది కలర్స్ స్వాతి. ఒక వేళ సినిమాల్లో నటిమచటానికి అవకాశాలు రాకపోయినా కలర్స్ స్వాతికి ఏం భయంలేదు... ఎంచక్కా గాయనిగా పాటలు పాడుకుంటూ లైఫ్ ని హ్యాపీగా గడిపేయవచ్చు కదా.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com