
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) లేటెస్ట్ మూవీ ‘పెద్ది’ (Peddi) ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఎన్నో పాత రికార్డులను తిరగరాసి, ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచిన ఈ చిత్రం, ఇప్పుడు మూడో వారంలోకి అడుగుపెడుతూ ప్రేక్షకులకు ఒక ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమైంది. అభిమానులను, సినిమా లవర్స్‌ను థియేటర్లకు రప్పించేలా సరికొత్త సీన్లను జోడించి నేటి నుండి సరికొత్త వెర్షన్‌తో ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.
ఈ చిత్రానికి సంబంధించిన ఒక సంచలన అప్‌డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సినిమాకు అదనపు ఆకర్షణగా దాదాపు ఆరు నిమిషాల నిడివి గల కొత్త విజువల్స్‌ను యాడ్ చేశారు. ఖచ్చితంగా చెప్పాలంటే, నేటి నుండి థియేటర్లలో ప్రదర్శితమయ్యే వెర్షన్‌లో 5 నిమిషాల 56 సెకన్ల సరికొత్త ఫుటేజ్ ప్రేక్షకులకు అదనపు విజువల్ ట్రీట్‌గా లభించనుంది. ఈ కొత్త సన్నివేశాలు కథకు మరింత బలాన్ని ఇస్తాయని, ముఖ్యంగా చరణ్ ఫ్యాన్స్‌కు థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సైతం ఈ 5 నిమిషాల 56 సెకన్ల కొత్త కంటెంట్ కోసం మళ్లీ థియేటర్లకు క్యూ కట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు.
మరో అద్భుతమైన వార్త ఏమిటంటే, ఈ గురువారం నుండి ఈ చిత్రం సాధారణ టికెట్ ధరలకే అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకు ఉన్న ప్రత్యేక ధరలను తగ్గించి, సాధారణ రేట్లకే టికెట్లను విక్రయించనుండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది.
ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం, మొదటి రోజు నుండి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతూ 2026 సౌత్ ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సరికొత్త టికెట్ ధరల తగ్గింపు, అదనపు సీన్ల కలయిక సినిమా రన్ మరింత కాలం కొనసాగేలా చేయడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.
వృద్ది సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా సమర్పించిన ఈ చిత్రం, రామ్ చరణ్ సోలో హీరోగా కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా సరికొత్త రికార్డు సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సాధిస్తున్న అద్భుతమైన వసూళ్లు మెగా ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను రెట్టింపు చేసేలా జోడించిన ఈ కొత్త సీన్లతో ‘పెద్ది’ చిత్రం మూడో వారంలో కూడా సరికొత్త వసూళ్ల ప్రభంజనం సృష్టించడానికి సిద్ధంగా ఉంది.






