
పవన్ కళ్యాణ్(Pawan Kalyan),ప్రకాష్ రాజ్(Prakash Raj)కాంబో సెల్యులాయిడ్ పై చేసే మెస్మరైజ్ కి లెక్కలేనంత మంది అభిమానులు ఉన్నారు. రెండున్నర దశాబ్దాల క్రితం సుస్వాగతం మూవీతో స్టార్ట్ అయిన ఆ కాంబో మ్యాజిక్ మొన్న ఓజి వరకు కొనసాగుతూనే వస్తుంది. రాజకీయాల్లోను భిన్న దృవాలుగా ఉంటూ పలు సంచలనాలకి వేదికగా నిలుస్తూ వస్తున్నారు.
పవన్ కల్యాణ్ ఇటీవల మాట్లాడుతూ తెలంగాణాలో జనసేన తరుపున పోటీ చేస్తామని ప్రకటించాడు. ఈ వ్యాఖ్యలపై ప్రకాష్‌రాజ్ ఎక్స్ వేదికగా స్పందిస్తు 'మీరొస్తామంటే మేమొద్దంటామా.. రండి దొర సింగిల్‌గా వస్తున్నారా, పొత్తుతో వస్తున్నారా చెప్పి రండి అంటూ ట్వీట్ చేశాడు.
Also read: Peddi: మళ్ళీ పుడతామా యేటి.. పెద్ది బ్లాక్ బస్టర్
అయితే ప్రకాష్‌రాజ్ పోస్టుకి బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చారు. ప్రతి దాంట్లో వేలు ఎందుకు పెడతా. అసలు నువ్వెవరు.. తమిళోడివా.. తెలుగోడివా, కన్నడిగవా! ప్రతి విషయంపై జడ్జిమెంట్ ఇవ్వడానికి నువ్వేమైనా ప్రధానివా! అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీలవ్వవద్దు. ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో అంటూ ప్రకాష్ రాజ్ కి బండ్ల గణేష్ కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేసాడు.






