చిరంజీవి బర్త్ డే ని ఘనంగా చేసిన రామ్ చరణ్.. ఆ విషయంలో పోటీ ఉంటుందా!
on Aug 22, 2025

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)70వ పుట్టినరోజు వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అభిమానులతో పాటు, దేశ, విదేశాల్లో ఉన్న అభిమానులు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. పైగా ఈ రోజు చిరంజీవి, అనిల్ రావి పూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీకి సంబంధించి 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)అనే టైటిల్ ని అనౌన్స్ చెయ్యడం, ఈ మూవీకి సంబంధించి గ్లింప్స్ ని రిలీజ్ చెయ్యడంతో, మెగా అభిమానులకి ఈ పుట్టిన రోజు డబుల్ జోష్ ని ఇచ్చింది.
రీసెంట్ గా, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేసాడు. సదరు వీడియోలో పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి కేక్ కట్ చేయగానే, చిరంజీవి, చరణ్ ఒకరికొకరు ఆప్యాయంగా కౌగిలించుకొని, కేక్ తినిపించుకున్నారు. ఆ తర్వాత చిరంజీవి కాళ్ళకి చరణ్ నమస్కరించాడు. ఇప్పడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా, అభిమానులని విశేషంగా ఆకర్షిస్తుంది. శ్రీమతి సురేఖ గారితో పాటు, కింగ్ నాగార్జున(Nagarjuna)తో షిర్డీసాయి, ఓం నమో వెంకటేశాయ వంటి చిత్రాలని నిర్మించిన మహేష్ రెడ్డి కూడా ఉన్నారు.
చిరంజీవి, చరణ్ కలిసి మగధీర తో పాటు ఆచార్య వంటి చిత్రాల్లో నటించారు. చరణ్ ప్రస్తుతం తన పెద్ది మూవీతో బిజీగా ఉండగా, నెక్స్ట్ ఇయర్ మార్చి 27 2026 న విడుదల కానుంది. చిరంజీవి అప్ కమింగ్ మూవీస్ లో ఒకటైన 'విశ్వంభర'(Vishwambhara)కూడా వచ్చే ఏడాది వేసవికి విడుదల కానుంది. చిరంజీవి ఈ విషయాన్నీఇటీవల స్వయంగా ప్రకటించాడు. మరి పెద్ది(Peddi)మార్చిలోనే వస్తుంది కాబట్టి ఇద్దరి మధ్య పోటీ ఉంటుందా లేదో చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



