గుడ్ న్యూస్ చెప్పిన రామ్ చరణ్.. చిరంజీవి కోరిక నెరవేరుతుందా?
on Oct 23, 2025

రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన (Upasana) దంపతులు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. వారు రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఈ దీపావళికి డబుల్ సెలబ్రేషన్ అంటూ ఉపాసన సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేశారు. అందులో ఉపాసన సీమంతం వేడుకకు సంబంధించిన విజువల్స్ ఉన్నాయి. ఇరు కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరై ఉపాసనను ఆశీర్వదించారు. అందులో వెంకటేష్, నాగార్జున, నయనతార వంటి స్టార్స్ ఉన్నారు.
చరణ్, ఉపాసన వివాహం 2012 లో జరిగింది. 2023 లో వీరికి పాప పుట్టింది. పాప పేరు క్లీంకార. ఇప్పుడు బాబు పుడితే బాగుంటుందని, మెగా వారసుడు వచ్చినట్టు అవుతుందని అభిమానులు ఆశపడుతున్నారు. చిరంజీవి (Chiranjeevi) కోరిక కూడా అదే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. అందరూ మనవరాళ్లే అయ్యారని, ఓ మనవడు ఉంటే బాగుంటుందని గతంలో ఒక ఈవెంట్ లో చిరంజీవి తన మనసులోని మాట బయటపెట్టారు. మరి చిరంజీవి కోరుకున్నట్టుగా ఈసారి మనవడు పుడతాడేమో చూద్దాం. ఇంకో విశేషం ఏంటంటే, ఈ సారి కవలలు పుట్టబోతున్నట్లు మెగా సన్నిహితుల నుంచి వినిపిస్తున్న మాట. మరి అందులో వాస్తవమెంతో తెలియాల్సి ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



