Home

»

Latest News

`భీమ్లా నాయ‌క్`కి క్రిస్పీ ర‌న్ టైమ్.. ఒరిజిన‌ల్ కంటే అర‌గంట త‌క్కువే!

Dec 09, 2021

`వ‌కీల్ సాబ్`తో గ్రాండ్ రీ-ఎంట్రీ ఇచ్చిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.. త్వ‌ర‌లో `భీమ్లా నాయ‌క్`గా సంద‌డి చేయ‌నున్నారు. మాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్`కి రీమేక్ గా తెర‌కెక్కిన ఈ సినిమాలో రానా ద‌గ్గుబాటి మ‌రో హీరోగా క‌నిపించ‌నున్నారు. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ స్క్రీన్ ప్లే, సంభాష‌ణ‌లు స‌మ‌కూర్చ‌గా.. సాగ‌ర్ కె చంద్ర ఈ చిత్రాన్ని రూపొందించారు. సితార ఎంట‌ర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి యంగ్ మ్యూజిక్ సెన్సేష‌న్ త‌మ‌న్ బాణీలు అందించారు.

ఇదిలా ఉంటే.. `భీమ్లా నాయ‌క్` ర‌న్ టైమ్ కి సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. అదేమిటంటే.. 140 నిమిషాల (2 గంట‌ల 20 నిమిషాలు) నిడివితో ఈ సినిమా సాగుతుంద‌ట‌. అదే గ‌నుక నిజ‌మైతే.. ఒరిజిన‌ల్ వెర్ష‌న్ కంటే అరగంట‌కి పైగా డ్యూరేష‌న్ త‌గ్గిన‌ట్టే.  `భీమ్లా నాయ‌క్` ఒరిజిన‌ల్ వెర్ష‌న్ `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్` ఏకంగా 175 నిమిషాల (2 గంట‌ల 55 నిమిషాలు) ర‌న్ టైమ్ తో సాగే మూవీ. మ‌రి.. ఈ క్రిస్పీ ర‌న్ టైమ్ `భీమ్లా నాయ‌క్`కి ఏ మేర‌కు ప్ల‌స్ అవుతుందో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.

కాగా,  సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న విడుద‌ల కానున్న `భీమ్లా నాయ‌క్`లో ప‌వ‌న్ కి జంట‌గా నిత్యా మీన‌న్, రానాకి జోడీగా సంయుక్తా మీన‌న్ క‌నిపించ‌నున్నారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com