సెన్సేషనల్ డైరెక్టర్ తో రామ్ చరణ్ మూవీ.. లెక్క వెయ్యి కోట్ల నుంచి మొదలు!
on Mar 23, 2025
అపజయం ఎరుగకుండా వరుస విజయాలతో దూసుకుపోతూ సంచలనం సృష్టిస్తున్నాడు కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. ప్రస్తుతం రజినీకాంత్ తో 'కూలీ' సినిమా చేస్తున్న లోకేష్.. కేవీఎన్ ప్రొడక్షన్స్ లో మూడు భారీ సినిమాలు కమిట్ అయ్యాడు. వాటిలో రెండు ప్రాజెక్ట్ లు కార్తీతో 'ఖైదీ-2', సూర్యతో 'రోలెక్స్' కాగా.. మూడోది రామ్ చరణ్ తో అని తెలుస్తోంది. (Lokesh Kanagaraj)
రామ్ చరణ్, లోకేష్ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. ఎట్టకేలకు వీరి కాంబో ప్రాజెక్ట్ లాక్ అయినట్లు వినికిడి. ప్రస్తుతం రామ్ చరణ్ తన 16వ సినిమాని బుచ్చిబాబు దర్శకత్వంలో చేస్తున్నాడు. 17వ సినిమాని సుకుమార్ డైరెక్షన్ లో చేయనున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత చరణ్ తన 18వ సినిమాని లోకేష్ తో చేసే అవకాశముందని సమాచారం. (Ram Charan)
'ఆర్ఆర్ఆర్'తో చరణ్ గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకోగా.. ఖైదీ, విక్రమ్, లియో వంటి సినిమాలతో లోకేష్ కోలీవుడ్ టాప్ డైరెక్టర్ గా ఎదిగాడు. అలాంటిది ఈ ఇద్దరి కాంబోలో సినిమా అంటే.. కేవలం ప్రకటనతోనే అంచనాలు తారాస్థాయికి చేరతాయి అనడంలో సందేహం లేదు. ఇక కలెక్షన్ల లెక్క రూ.1000 కోట్ల గ్రాస్ నుంచి మొదలవుతుంది అంటూ అభిమానులు సంబరపడుతున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
