రామ్ చరణ్ కొత్త సినిమా ప్రకటన వచ్చింది
on Nov 28, 2022

శంకర్ దర్శకత్వంలో చేస్తున్న 'RC 15' తర్వాత రామ్ చరణ్ చేయబోయే తదుపరి సినిమాపై క్లారిటీ వచ్చింది. చరణ్ కొత్త సినిమా ప్రకటన వచ్చింది. 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు.
బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్ సినిమా చేయడం ఖరారైందని ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. "కొన్నిసార్లు తిరుగుబాటు అవసరం అవుతుంది" అంటూ ఈరోజు ఉదయం ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించారు. మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో సుకుమార్ రైటింగ్స్ తో కలిసి వృద్ధి సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1 గా వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రూరల్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా ఈ పాన్ ఇండియా మూవీ రూపొందనుందని తెలుస్తోంది. జనవరిలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశముందని సమాచారం. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించే అవకాశముంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



