రాజమౌళి చెప్పిందే చేస్తున్నాడట
on Jan 17, 2020
యాక్టింగ్ విషయానికి వస్తే తాను డైరెక్టర్స్ యాక్టర్ అని రామ్ చరణ్ చెబుతున్నాడు. డైరెక్టర్ విజన్ ఏంటో తెలుసుకుని అందుకు తగ్గట్టు నటిస్తాననీ... డైరెక్టర్స్ కి సరెండర్ అవుతాననీ... క్యారెక్టర్ గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడనని మెగాపవర్ స్టార్ పేర్కొన్నాడు. ప్రజెంట్ రాజమౌళి డైరెక్షన్ లో డీవీవీ దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్న భారీ బడ్జెట్ ఫిల్మ్ 'ఆర్ఆర్ఆర్'లో అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ చేస్తున్నాడు రామ్ చరణ్. అల్లూరి కోసం స్పెషల్ ప్రిపరేషన్స్ ఏమీ లేకుండా రాజమౌళి చెప్పింది చేస్తున్నానని తెలిపాడు.
"నేను ఏ క్యారెక్టర్ చేసినా... స్ట్రెస్ తీసుకోను. స్ట్రెస్ తీసుకోవడం నాకు నచ్చదు. అలా తీసుకున్న ప్రతిసారీ తప్పులు చేశా. అందుకని, డైరెక్టర్ చెప్పింది చేస్తా. 'రంగస్థలం'లో సరిగా వినపడని క్యారెక్టర్ కోసం నేను ఎలా ప్రిపేర్ అయ్యానని చాలామంది అడుగుతారు. నిజం చెప్పాలంటే... నేను ఏమీ ప్రిపేర్ కాలేదు. జీరో ప్రిపరేషన్. 'ఆర్ఆర్ఆర్' విషయంలోనూ అలాగే రాజమౌళి విజన్ కి సరెండర్ అయ్యా" అని రామ్ చరణ్ చెప్పాడు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎప్పుడూ ఎనర్జీతో ఉంటాడనీ... అతడు సెట్ లో ఉంటే ఎంతో సరదాగా ఉంటుందనీ రామ్ చరణ్ అన్నాడు. అలియా భట్ తో తన కాంబినేషన్ సీన్స్ షూటింగ్ స్టార్ట్ చేయలేదన్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన అలియా భట్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read