మాల్దీవుల్లో కాకపుట్టించి, ఇంటికి బయల్దేరిన రకుల్!
on Nov 24, 2020

కొద్ది రోజులుగా ఫ్యామిలీతో కలిసి మాల్దీవుల్లో సెలవుల్ని అమితంగా ఆస్వాదిస్తూ, తన సిజ్లింగ్ పిక్చర్స్‌తో సోషల్ మీడియాను వేడెక్కిస్తూ వచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ తిరుగుప్రయాణమైంది. మంగళవారం ఉదయం ఫ్యామిలీతో గ్రూప్ ఫొటో దిగిన ఆమె, తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా దాన్ని షేర్ చేసింది. "Where life begins and love never ends !! FAMILY #besttimes #vacayvibes and now workmode" అంటూ దానికి క్యాప్షన్ జోడించింది. అంటే అమ్మడు ఇంక తన వర్క్‌లోకి వచ్చేస్తోందన్న మాట.
.jpg)
మాల్దీవుల నుంచి ఆమె షేర్ చేసిన ఫొటోల్లో తన బాడీని ఆమె ఎంత బాగా తీర్చిదిద్దుకుంటోందో బికినీల్లో ఆమె రూపలావణ్యాలు తెలియజేశాయి. అక్కడ్నుంచి ఆమె పోస్ట్ చేసిన ప్రతి ఫొటో కాకపుట్టించేదిగా ఉందనడంలో సందేహం లేదు. సూర్యోదయం నేపథ్యంలో బీచ్‌లో వర్కవుట్ చేసిన ఫొటో కానీ, ఆరంజ్ బికినీలో సన్‌బాత్ చేస్తున్నట్లుగా కూర్చున్న పిక్చర్ కానీ, గ్రీన్ బికినీలో మాల్దీవుల గాలిని ఆస్వాదిస్తున్నట్లు నిల్చున్న ఫొటో కానీ, నెట్‌పై పడుకొని సేదతీరుతున్న పిక్చర్ కానీ.. ఆమె నుంచి చూపు తిప్పుకోవడం కష్టమన్నట్లే ఉంది.
.jpg)
నిజం చెప్పాలంటే టాలీవుడ్‌లో బెస్ట్ షేప్డ్ హీరోయిన్ ఎవరంటే రకుల్ పేరే చెబుతారు ఎవరైనా. ఫిట్‌నెస్ ఫ్రీక్ అయిన ఆమె ఎక్కడకు వెళ్లినా వర్కవుట్స్ మాత్రం మానదు. తన శరీరాన్ని విల్లులా సునాయాసంగా వంచేసే ఆమెను చూస్తే.. ఆమె ఎలా చెబితే అలా ఆమె బాడీ వింటుందనిపిస్తుంది.
.jpg)
.jpg)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



