రకుల్ ఫ్యూచర్.. ఎన్టీఆర్ చేతుల్లో
on Nov 14, 2015
.jpg)
రకుల్ ప్రీత్ సింగ్ పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా ఉంది. చేతిలో సినిమాలున్నా.. హిట్ లు లేకపోవడంతో.. ఈ లక్కీగాళ్‌కి ఐరెన్ లెగ్ అనే ముద్ర తప్పడం లేదు. ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారి, బడా కథానాయికలకు సైతం చమట్లు పట్టించింది రకుల్. సమంత, కాజల్, తమన్నా.. వీళ్లంతా రకుల్ దెబ్బకు తట్టా బుట్టా సర్దేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే రకుల్ పరిస్థితి ఇప్పుడు రివర్స్ అయ్యింది. వరుసగా.. ఫ్లాప్స్ తగలడంతో.. రకుల్ కెరీర్‌లో కుదుపులు మొదలయ్యాయి.
ఇన్ని సినిమాలు చేసినా.. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, లౌక్యం సినిమాలు మాత్రమే హిట్స్ జాబితాలో చేరాయి. కరెంటు తీగ ఓ మాదిరిగా ఆడిందంతే. కిక్ 2, బ్రూస్లీ, పండగ చేస్కో ఢమాల్ అన్నాయి. ఈ సినిమాల ద్వారా రకుల్ తన గ్లామర్‌ని వీలైనంత వరకూ.. ప్రదర్శించినా.. ఫలితం లేకుండా పోయింది. రకుల్ చేతిలో ఉన్న ఒకే ఒక్క ఆశా దీపం... నాన్నకు ప్రేమతో. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతోంది. ఎన్టీఆర్ సినిమాతో హిట్టు కొట్టి తనని తాను నిరూపించుకోవాలనుకొంటోంది రకుల్.
అయితే.. ఓ సెంటిమెంట్ రకుల్‌ని భయంకరంగా భయపెడుతోంది. అదేంటంటే.. సుకుమార్ సినిమాల్లో హీరోయిన్ గా చేసినవాళ్లెవ్వరూ అంతగా క్లిక్కవ్వలేదు. ఒక్క తమన్నాని మినహాయిస్తే.. సుక్కు సినిమా తరవాత వాళ్లకు కెరీరే లేకుండా పోయింది. ఇప్పుడు నా పరిస్థితీ ఇంతేనా.... అంటూ రకుల్ కంగారు పడిపోతోంది. ఈ సినిమాని హిట్ చేసి... నన్ను కాపాడు అంటూ భగవంతుడ్ని కోరుకొంటోందట రకుల్. మరి... రకుల్ ఫేట్‌ని ఎన్టీఆర్ అయినా మారుస్తాడో లేదో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



