Home

»

Latest News

KHxRK: రజినీ, కమల్ మల్టిస్టారర్ మూవీ బడ్జెట్ ఇంతే!. మరి ఆ మాత్రం హడావిడి ఉండాలిగా 

May 06, 2026

ఇండియన్ సినిమా హిస్టరీలో అత్యంత ఖరీదైన మూవీ ఏదంటే రజినీ(Rajinikanth),కమల్(Kamal Haasan)ప్రాజెక్ట్ అని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి కాదు. ప్రెజెంట్ సినిమా పిచ్చి పిల్లలకి ఈ విషయంలో ఎలాంటి డౌట్స్ ఉన్నా రజినీ, కమల్ సినీ హిస్టరీ ని ఒకసారి 'అంగ్ పారు'.. మరి అలాంటి  ఆ  ఈ ఇద్దరు సిల్వర్ స్క్రీన్ ని షేర్ చేసుకుంటే.. అది 47 ఏళ్ల తర్వాత అయితే.. హిస్టరీనే ఒకసారి తన పుట్టు పూర్వోత్తరాలు చూసుకునే పరిస్థితి. ఎందుకంటే కొత్త రికార్డులు నమోదవుతాయి కనుక. త్వరలోనే రెగ్యులర్  షూటింగ్ కి వెళ్ళబోతున్న ఈ చిత్రం యొక్క బడ్జెట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది డే గా నిలిచింది 
 
తాజా సమాచారం ప్రకారం సుమారు 600 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నట్టుగా తెలుస్తుంది. విశేషమేమిటంటే ఈ బడ్జెట్‌లో సింహభాగం కేవలం ప్రధాన నటీనటులు మరియు దర్శకుడి రెమ్యునరేషన్లకే ఎక్కువ భాగం వెళ్లనున్నట్టుగా చెప్తున్నారు. లాభాల్లో వాటా తీసుకునే పద్ధతిలో పనిచేసే కమల్ 150 కోట్లు, రజినీకాంత్ . 180 నుండి 200 కోట్లు, దర్శకుడు  నెల్సన్ దిలీప్ కుమార్(Nelson Dilip Kumar)60 కోట్లు తీసుకోనున్నట్టుగా టాక్. అంటే వీరి ముగ్గురి పారితోషికాలే దాదాపు 400 కోట్లు. అయితే ఇంత బడ్జెట్ అయినా కూడా  బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల మార్కుని అందుకోవడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.


Also read: Ntr: ఎన్టీఆర్ డ్రాగన్ కోసం రంగంలోకి దేవ కట్టా.. ఎంత పని చేసావు ప్రశాంత్ నీల్ 

రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్‌పై తమిళనాడు మాజీ ఉప ముఖ్యమంతి ప్రస్తుత ఎంఎల్ ఏ ఉదయనిధి స్టాలిన్ నిర్మిస్తుండగా అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. లెజండ్రీ డైరెక్టర్ రాజీవ్ మీనన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. 80ల నాటి అనుభూతిని కలిగించడానికి  వింటేజ్ ఫిల్మ్ కెమెరాలతో షూట్ చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలైన చిన్న ప్రోమో సోషల్ మీడియాని ఊపేస్తోంది. రజినీ, నెల్సన్ ల జైలర్ 2 జూన్ 12 న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com