
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) అభిమానులకు త్వరలో ఒక భారీ సర్‌ప్రైజ్ రాబోతోంది. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' (Dragon) ప్రాజెక్టుతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'గాడ్ ఆఫ్ వార్' (God of War) సినిమాకు సంబంధించి ఒక క్రేజీ అప్‌డేట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
మే 20న భారీ ప్రకటన?
ఈ సినిమా మేకర్స్ ప్రస్తుతం 'గాడ్ ఆఫ్ వార్' అనౌన్స్‌మెంట్ వీడియో పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ ప్రత్యేక వీడియోను మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ఈ వీడియోను అత్యున్నత ప్రమాణాలతో రూపొందిస్తున్నట్లు సమాచారం.
VFX పనులపై ప్రత్యేక దృష్టి
ఈ అనౌన్స్‌మెంట్ వీడియోలో విజువల్ ఎఫెక్ట్స్ (VFX) అత్యంత కీలకం కానున్నాయి. తాజా సమాచారం ప్రకారం చిత్ర బృందం ఈ వీడియో కోసం రేయింబవళ్లు శ్రమిస్తోంది. అవుట్‌పుట్ లో వచ్చే వీఎఫ్ఎక్స్ నాణ్యత పట్ల మేకర్స్ సంతృప్తి చెందితే, మే 20న దీనిని అధికారికంగా విడుదల చేస్తారు. ఒకవేళ ఏవైనా మార్పులు అవసరమైతే తప్ప, ఎన్టీఆర్ బర్త్ డే రోజున 'గాడ్ ఆఫ్ వార్' అనౌన్స్‌మెంట్ వీడియో రావడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే ఎన్టీఆర్ బర్త్ డే ట్రీట్ తో ఫ్యాన్స్‌కు పూనకాలు గ్యారెంటీ అని చెప్పవచ్చు.
'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ రేంజ్ అంతర్జాతీయ స్థాయికి పెరిగింది. అందుకే 'గాడ్ ఆఫ్ వార్' వంటి భారీ చిత్రాల విషయంలో మేకర్స్ ఏ చిన్న విషయంలోనూ రాజీ పడకూడదని నిర్ణయించుకున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే, మే 20న సోషల్ మీడియా షేక్ అవ్వడం ఖాయం.
మరోవైపు ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా మే 20న 'డ్రాగన్' గ్లింప్స్ కూడా విడుదల కానుంది. ఓ వైపు 'డ్రాగన్' గ్లింప్స్, మరోవైపు 'గాడ్ ఆఫ్ వార్' అనౌన్స్‌మెంట్ వీడియోతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ అందనుంది.






