టీవీ యాక్టర్‌కి 12 లక్షలొచ్చాయి! ఎలా అంటే?
on Jun 6, 2020

ప్రజల్లో మానవత్వం ఇంకా మరణించలేదని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. మంచితనం, మంచి మనుషులు ఇంకా మిగిలి ఉండబట్టే విరాళాలు వెల్లువలా వస్తున్నాయి. అందువల్లే, చేతిలో చిల్లిగవ్వ లేక ఇబ్బందులు పడుతూ కనీళ్లు పెట్టుకున్న టీవీ నటుడికి 12 లక్షల రూపాయలు వచ్చాయి. అసలు వివరాల్లోకి వెళితే... లాక్‌డౌన్ వల్ల హిందీ టీవీ యాక్టర్ రాజేష్ కరీర్‌కి కష్టాలు మొదలయ్యాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎదురు కావడంతో ఏం చేయాలో తెలియక, ఎవరైనా దాతలు సహాయం చేయమంటూ ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారు. దానికి విపరీతమైన స్పందన లభించింది. సుమారు 200మంది ఆయనకు 12 లక్షల రూపాయాలను ఆయన అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేశారు. ఇంత మొత్తం వస్తుందని ఆయన కూడా ఊహించలేదు. అందులో చైనా నుండి ఎవరో 21 వేల రూపాయాలు పంపారట. ఒక సీరియల్‌లో ఆయనకు కుమార్తెగా నటించిన శివానీ జోషి సైతం 10 వేల రూపాయలు పంపారని రాజేశ్ కరీర్ తెలిపారు. ఇప్పుడు సరిపడా డబ్బు ఉండడంతో కొన్ని రోజులు స్వరాష్ట్రం పంజాబ్‌లో ఉంటానని అతడు తెలిపాడు. తనకు ఇంకెవరూ సహాయం చేయవద్దని కోరారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



