అనిల్ రావిపూడికి రాజేంద్రప్రసాద్ ముద్దు!
on Mar 8, 2021
రాజేంద్రప్రసాద్ (ఆర్పీ) అంటే డైరెక్టర్ అనిల్ రావిపూడికి ప్రత్యేకమైన అభిమానం. ఆయనను డాడీ అని ఆత్మీయంగా పిలుచుకుంటాడు అనిల్. 'సుప్రీమ్' సినిమా నుంచి అనిల్ డైరెక్ట్ చేసిన ప్రతి సినిమాలో రాజేంద్రప్రసాద్ ఉంటున్నారు. హాస్యాన్ని కురిపిస్తున్నారు. లేటెస్ట్గా ఆయన స్క్రీన్‌ప్లే అందించి, సమర్పించిన 'గాలి సంపత్' మూవీలో రాజేంద్రప్రసాద్ టైటిల్ రోల్ పోషించారు.
'గాలి సంపత్' ప్రి రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన అనిల్ రావిపూడి ఆయనను ప్రశంసల్లో ముంచేశాడు. "మా జర్నీ 'సుప్రీమ్'తో స్టార్టయింది. ప్రతి సినిమాలో గోల గోల చేస్తూనే ఉన్నాం. ఒక్కో సినిమాకు ఒక్కో స్టైల్. ఒక్కొక్క మేనరిజమ్‌తో ఒక్కో హడావిడి. ఎంటర్టైన్మెంట్లో ఆయనను కొట్టేవారే లేరు. ఈ సినిమాలో ఆయనతో ఇంకోలాగా వర్క్ చేసే అవకాశం దొరికింది. కొన్ని కీలక సన్నివేశాల కోసం ఆయనతో నేను ఉండాల్సి వచ్చింది. గొయ్యి ఎపిసోడ్లో పదిహేను రోజులు ఆయన పడ్డ కష్టం రేపు మీరు స్క్రీన్ మీద చూస్తారు. డాడీ.. యు ఆర్ ద లెజెండ్." అనగానే ఆర్పీ వచ్చి అనిల్‌ను హత్తుకున్నారు. అంతేనా.. చెంపమీద ముద్దుకూడా పెట్టేసుకున్నారు. ఈ సన్నివేశం అందర్నీ ఆకట్టుకుంది.
అనిల్ రావిపూడి కొనసాగిస్తూ, "అనేక సినిమాలతో మనల్ని ఎంటర్టైన్ చేసిన గొప్ప నటుడు ఒక గొప్ప సినిమాలో యాక్ట్ చేశారు. ఇది సెలబ్రేషన్ ఫర్ రాజేంద్రప్రసాద్ గారు. ఆయన కోసం ఈ సినిమా విడుదలైన రోజు మార్నింగ్ షోను నా ఫ్యామిలీతో కలిసి చూడబోతున్నాను. ఆయనకు ఈ సినిమా ద్వారా సెలబ్రేషన్ ఇవ్వాలని ప్రేక్షకులను కూడా కోరుకుంటున్నాను." అని చెప్పుకొచ్చాడు.
Also Read