Home

»

Latest News

"ఒక్క అమ్మాయి తప్ప" దర్శకుడి కొత్త సినిమా..!!

Jul 18, 2016 10:48AM

రచయితగా మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలకు సూపర్ హిట్ కామెడీ ట్రాక్ లు రాసిన రాజసింహకు దర్శకుడిగా మాత్రం పరిచయ చిత్రమైన "ఒక్క అమ్మాయి తప్ప" దారుణమైన పరాజయాన్ని మిగిల్చింది. సందీప్ కిషన్, నిత్యామీనన్ జంటగా తెరకెక్కిన ఈ చిత్రం రెండు నెలల క్రితం విడుదలై ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేక చతికిలపడింది. దాంతో డైరెక్టర్ గా రాజసింహ కెరీర్ మొదటి సినిమాతోనే ఆగిపోయిందని చాలా మంది అనుకొన్నారు. 

అయితే.. త్వరలోనే రాజసింహ మరో సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడని తెలుస్తోంది. అయితే.. ఈసారి కొత్తవారితో ఒక టిపికల్ ట్రెండీ లవ్ స్టోరీ ప్లాన్ చేస్తున్నాడట. ఈ చిత్రాన్ని రాజసింహ ఎన్నారై స్నేహితులు నిర్మిస్తారట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ కు వెళ్లనుందని, ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని రాజసింహ తెలిపారు!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com