
"జై చిరంజీవ" చిరంజీవి అమెరికా వరకూ పరిగెట్టించిన బాలీవుడ్ విలన్ అర్బాజ్ ఖాన్ గుర్తున్నాడుగా. ఆ సినిమా తర్వాత అర్బాజ్ మళ్ళీ తెలుగులో కనిపించలేదు. బాలీవుడ్ లోనే చిన్నాపెద్దా క్యారెక్టర్లు చేస్తూ ఉండిపోయాడు. అన్నయ్య సల్మాన్ ఖాన్ ప్రోత్సాహంతో "దబాంగ్ 2" చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు నిర్వహించి ఫ్లాప్ ను మూటగట్టుకొన్నాడు. మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత మరోమారు టాలీవుడ్ లో విలన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.
రాజ్ తరుణ్ హీరోగా ఎకె ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై "దొంగాట" ఫేమ్ వంశీకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రంలో అర్బాజ్ ను విలన్ గా ఎన్నుకొన్నారట. ట్రెండీ కన్ఫ్యూజన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మాలీవుడ్ బ్యూటీ అను ఎమ్మాన్యూల్ కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా అక్టోబర్ లో విడుదల కానుందని సమాచారం!





.jpg)
