రణవీర్‌ను చంపేస్తా: సల్మాన్‌ఖాన్
on Jul 17, 2016
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ కోపంతో ఊగిపోయాడు. ప్రముఖ హీరో రణవీర్‌సింగ్‌ను చంపేస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఇది సరదాగా ఇచ్చిందే. అసలు మ్యాటరేంటంటే సల్మాన్ రీసెంట్ మూవీ ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమాను చూసిన పలువురు బాలీవుడ్ ప్రముఖులు సల్మాన్ నటనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రణవీర్ "బేఫికర్" సినిమా షూటింగ్ ప్రస్తుతం ప్యారిస్‌లో జరుగుతోంది.
అక్కడ రణవీర్ చిత్ర యూనిట్‌తో కలిసి సుల్తాన్ చూశాడు. అయితే సల్మాన్ పాట వచ్చినపుడు ఆనందంతో ధియేటర్లో స్టెప్పులు వేశాడట..అప్పుడు ప్రేక్షకులు సినిమా కంటే రణవీర్ వేసే స్టెప్పులనే ఎంజాయ్ చేశారు. దీనిపై మీడియా సల్మాన్‌ను ప్రశ్నించగా..రణవీర్ తల పగలగొట్టి చంపేయాలనుంది..ప్రేక్షకులు సినిమా చూస్తున్నప్పుడు అలా స్టంట్స్, డ్యాన్స్ చేసి విసిగించకూడదు. వారిని సినిమా చూడకుండా తన డ్యాన్స్‌తో ఎంటర్టైన్ చేశాడు. అతను అలా చేసినందుకు జరిమానా విధించాల్సింది అంటూ సల్మాన్ సరదాగా అన్నాడు.
Also Read