రాజశేఖర్ సినిమాకి 'ఆర్జీవీ' నిర్మాత
on Aug 8, 2020

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ మంచి కథలు, దర్శకుల్ని లైనులో పెడుతున్నారు. 'కల్కి' తరవాత కొంత విరామం తీసుకున్న ఆయన, ప్రస్తుతం మూడు కథలు ఓకే చేసి పెట్టుకున్నారు. కరోనా వల్ల మరింత ఖాళీ సమయం దొరకడంతో మరిన్ని కథలు వింటున్నారట. 'పలాస' దర్శకుడు కరుణకుమార్‌తో రాజశేఖర్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. అలాగే, జాతీయ పురస్కారం అందుకున్న 'షో' సినిమా దర్శకుడు నీలకంఠతో మరో సినిమా చేయనున్నారు. దానిని 'ఆర్జీవీ' నిర్మాత ప్రొడ్యూస్ చేస్తున్నారు.
'ఆర్జీవీ' అంటే రామ్ గోపాల్ వర్మ కాదు. జొన్నవిత్తుల దర్శకత్వంలో వర్మపై సెటైరికల్ బయోపిక్ 'రోజూ గిల్లే వాడు - ఆర్జీవీ' రూపొందిస్తున్న నిర్మాతలలో ఒకరైన బొగ్గరమ్ వెంకట శ్రీనివాస్. గతంలో హిట్ సినిమా 'కార్తికేయ' ప్రొడ్యూస్ చేశారు. రాజశేఖర్, నీలకంఠ కాంబినేషన్‌లో సినిమాకు ఆయన నిర్మాత. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో 'కార్తికేయ' శ్రీనివాస్ ఈ సినిమా చేస్తున్నారు. కరోనా తగ్గితే సెప్టెంబర్ నుండి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



