
బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మెహరీన్ జంటగా నటించిన `కవచం` చిత్రం లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో విడుదలై అట్టర్ ఫ్లాప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. సినిమాకు అటు ప్రేక్షకుల నుంచి ఇటు విమర్శకుల నుంచి విపరీతమైన కామెంట్స్ వచ్చాయి. అయితే ఈ సినిమా హిందీలో `ఇన్స్పెక్టర్ విజయ్ ` పేరుతో డబ్ చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేసారు. ఈ సినిమాను యూట్యూబ్ లో అప్ లోడ్ చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే కోటి యాభై లక్షల మంది చూడటం విశేషం. తెలుగు ప్రేక్షకులను మెప్పించలేకోయిన కవచం హిందీ లో వ్యూస్ చూసి టాలీవుడ్ జనాలు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఇక గత కొంత కాలంగా తెలుగులో విడుదలవుతోన్న ప్రతి సినిమా ను హిందీలో డబ్ చేసి రీలజ్ చేస్తున్నారు. అల్లు అర్జు న్ నటించిన `సరైనోడు` హిందీ డబ్బింగ్ వెర్షన్ యూట్యూబ్ లో ఎక్కువ మంది చూసిన డబ్బింగ్ సినిమాగా రికార్డుల మోత మోగించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ జయ జానకి నాయక చిత్రానికి కూడా మంచి వ్యూస్ వచ్చాయి. మొత్తానికి కవచం బిగ్ స్క్రీన్ పై సక్సెస్ సాధించకపోయినా.. యూట్యూబ్ లో మాత్రం తన సత్తా చాటింది అంటున్నారు సినీ జనాలు.




.jpg)

