శివానీ రాజశేఖర్ 'అద్భుతం'
on Nov 11, 2019
యాంగ్రీ స్టార్ రాజశేఖర్, డైనమిక్ లేడీ యాక్టర్ జీవిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఆల్రెడీ చిన్నకుమార్తె శివాత్మిక ‘దొరసారి’ సినిమాతో తెరంగేట్రం చేసింది. పెద్ద కుమార్తె శివాని కూడా ఈపాటికి ఎంట్రీ ఇవ్వాల్సిందే. కానీ, ‘2 స్టేట్స్’ సినిమా ఆగిపోవడంతో లేట్ అయ్యింది. అడివి శేష్ హీరోగా మొదలైన ఆ సినిమా ఆగినా... మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
‘ఇంద్ర’లో హీరో చిన్నప్పటి పాత్ర చేసిన తేజ గుర్తున్నాడా? అదే మొన్న సమంత ‘ఓ బేబీ’లో మనవడిగా నటించాడు. ఆ కుర్రాడు హీరోగా, శివానీ రాజశేఖర్ హీరోయిన్గా ఒక సినిమా మొదలైంది. ‘నరుడా డోనరుడా’ ఫేమ్ మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ‘అ!’, ‘కల్కి’ సినిమాల దర్శకుడు ప్రశాంత్ వర్మ క్రియేటివ్ ప్రొడ్యూసర్, రైటర్. సైంటిఫిక్ ట్విస్ట్‌తో ముడిపడిన లవ్ స్టోరీతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ‘అద్భుతం’ అనే టైటిల్ ఖరారు చేశారని తెలిసింది. సినిమా అద్భుతం అనేలా ఉంటుందో? లేదో? చూడాలి.