Home

»

Latest News

Rajasekhar: మహేష్ బాబు సినిమాలో యాంగ్రీ మ్యాన్.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన రాజశేఖర్!

Mar 26, 2026

  • SVSC మూవీపై రాజశేఖర్ కామెంట్స్ 
  • రేలంగి మావయ్య రోల్ చేయకపోవడానికి కారణం అదే!

టాలీవుడ్ క్రేజీ మల్టీస్టారర్ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది అన్నదమ్ములుగా నటించిన వెంకటేష్, మహేష్ బాబు. అయితే ఈ చిత్రంలో మరో కీలకమైన పాత్ర 'తండ్రి' క్యారెక్టర్. ప్రకాష్ రాజ్ పోషించిన ఆ రేలంగి మావయ్య పాత్ర సినిమాకే ఆత్మ వంటిది. నిజానికి ఆ అద్భుతమైన పాత్రను టాలీవుడ్ 'యాంగ్రీ మ్యాన్' రాజశేఖర్(Rajasekhar) చేయాల్సి ఉంది. ఆ ఛాన్స్ మిస్ అవ్వడంపై తాజాగా రాజశేఖర్ తనదైన శైలిలో స్పందించారు.

రాజశేఖర్ కీలక పాత్ర పోషించిన 'బైకర్'(Biker) మూవీ ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజశేఖర్.. రేలంగి మావయ్య పాత్ర చేయకపోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నప్పుడు, తండ్రి పాత్ర కోసం మొదట రాజశేఖర్‌ను సంప్రదించారట. "మీ స్మైల్ బాగుంటుంది. ఇందులో ఎప్పుడూ నవ్వుతూ ఉండే పాత్ర ఉంది, అది మీరు చేస్తే బాగుంటుంది అని అడిగారు. కానీ, ఎందుకనో కుదరలేదు." అని రాజశేఖర్ చెప్పుకొచ్చారు. "ఆ సినిమా చూసినప్పుడు, మంచి పాత్రను వదులుకున్నానని ఏమైనా ఫీలయ్యారా" అని అడగగా.. అలాంటిదేం లేదని రాజశేఖర్ బదులిచ్చారు.

నిజానికి రాజశేఖర్ తన కెరీర్ ఆరంభం నుండి పవర్‌ఫుల్ పాత్రలతో, యాక్షన్ సినిమాలతో మెప్పించారు. అలాంటి హీరో రేలంగి మావయ్య లాంటి పాత్రలో కనిపిస్తే కచ్చితంగా కొత్తగా ఉండేది. ప్రకాష్ రాజ్ తన నటనతో ఆ పాత్రకు ప్రాణం పోశారనడంలో సందేహం లేదు, కానీ రాజశేఖర్ ఆ పాత్ర చేసి ఉంటే సినిమాకు కొత్తదనం వచ్చేదని అభిమానులు భావిస్తున్నారు.

తెలుగులో మల్టీస్టారర్ ట్రెండ్‌ను మళ్ళీ పునరుద్ధరించిన చిత్రంగా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' నిలిచిపోయింది. పెద్దోడు, చిన్నోడు మధ్య ఉండే అనుబంధం, ఆ ఇంట్లోని మధ్యతరగతి భావోద్వేగాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇలాంటి క్లాసిక్ సినిమాలో రాజశేఖర్ భాగం అయ్యుంటే, నటుడిగా ఆయన కెరీర్ మరో మలుపు తిరిగేదేమో.

ప్రస్తుతం రాజశేఖర్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. హీరోగా కాకుండా విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే 'బైకర్' సినిమాలో శర్వానంద్ కి తండ్రిగా నటించారు.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com