Home

»

Latest News

Anna Konidala: చిరంజీవి నాకు బావగారు కాదు.. పవన్ కళ్యాణ్ వైఫ్ వైరల్ కామెంట్స్!

Mar 26, 2026

వదినలో అమ్మనో, అక్కనో చూసుకునే వారు ఎందరో ఉంటారు. అలాగే బావ గారిలో అన్నయ్యను చూసుకునే వారు కొందరు ఉంటారు. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సతీమణి అన్నా లెజ్నెవా కూడా తన బావ గారైన చిరంజీవి(Chiranjeevi)లో అన్నయ్యను చూసుకుంటున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ తాజాగా ఆమె చేసిన పోస్ట్ హృదయాన్ని హత్తుకునేలా ఉంది.

అన్నా లెజ్నెవా రీసెంట్ గా ఇన్‌స్టాగ్రామ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు స్వాగతం పలికారు. చిరంజీవి కూడా వెల్కమ్ చెప్పారు. అయితే దానికి ఆమె "థాంక్యూ అన్నయ్య" అని రిప్లై ఇవ్వడం అందరి దృష్టిని ఆకర్షించింది. బావ గారిని అన్నయ్య అని పిలవడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాజాగా దీనిపై అన్నా క్లారిటీ ఇచ్చారు. 

"అన్నయ్యా? బావగారా?" అంటూ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లో ఆమె పెట్టిన పోస్ట్ కట్టిపడేస్తోంది. "దాదాపు 15 ఏళ్ల క్రితం, అందరూ ఒకరికొకరు ఎంతో దగ్గరగా ఉన్న కుటుంబంలోకి నేను వచ్చాను. ఎలా కలవాలో, ఎవరిని ఏమని పిలవాలో కూడా తెలియదు. అందుకే నా భర్త వాడే మాటలనే నేనూ వాడాను. అవే అన్నయ్య, చిన్నన్నయ్య. మొదట్లో అవి నేను జాగ్రత్తగా, సందేహంతో పలికిన మాటలే. కానీ కాలక్రమంలో అవి నేను అనుభూతి చెందిన భావాలుగా మారాయి. నాకు అన్నయ్య లేరు. కానీ జీవితం నాకు ఇద్దరిని ఇచ్చింది.. చిరంజీవి & నాగబాబు" అంటూ అన్నా లెజ్నెవా పోస్ట్ చేశారు.

పవన్ కళ్యాణ్ అన్నయ్యలను తన అన్నయ్యల్లా భావిస్తూ అన్నా లెజ్నెవా చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది కదా బాండింగ్ అంటే అంటూ నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com